Maharashtra : షాక్‌లో సీఎం ఏక్‌నాథ్ షిండే.. సంబరాల్లో శివసేన

Maharashtra : మహారాష్ట్ర సీఎం షిండే వర్గానికి బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ముంబైలోని శివాజీ పార్కులో దసరా వేడుకల సభ కోసం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకే అనుమతి ఇచ్చింది. శివాజీ పార్క్‌లో దసరా వేడుకలు నిర్వహించేందుకు ఉద్ధవ్ ఠాక్రే, షిండే వర్గాలు పోటీ పడ్డాయి. అయితే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ శాంతిభద్రతల సమస్య పేరుతో ఈ రెండు వర్గాలకు అనుమతి నిరాకరించింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన దీనిపై బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
శివసేన పార్టీ ఆవిర్భవించిన 1966 నుంచి ప్రతి ఏటా ముంబైలోని శివాజీ మహారాజ్ పార్క్‌లో దసరా వేడుకలను శివసేన నిర్వహిస్తోంది. శివసేనలో చీలిక వల్ల ఈ ఏడాది శివాజీ పార్క్‌లో దసరా బహిరంగ సభ నిర్వాహణకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అయితే ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా బాంబే హైకోర్టు స్పందించింది. దీంతో ఉద్ధవ్ థాక్రే వర్గం సంబురాలు జరుపుకుంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com