Landslide : అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొండచరియల బీభత్సం..

Landslide :  అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొండచరియల బీభత్సం..
X
వాహనాలపై పడిన బండరాళ్లు..

అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొండచరియలు బీభత్సం సృష్టించాయి. పశ్చిమ కమెంగ్‌ జిల్లాలోని సప్పర్‌ క్యాంప్‌ సమీపంలో డిరాంగ్‌-తవాంగ్‌ రోడ్డులో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. ఆ మార్గం గుండా వెళ్తున్న వాహనాలపై పెద్దపెద్ద బండరాళ్లు పడ్డాయి. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. డిరాంగ్‌-తవాంగ్‌ మధ్య రోడ్డు 120 మీటర్ల మేర దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

గుట్టపై నుంచి బండరాళ్లు పడటాన్ని గమనించిన కొందరు.. తమ కారులో నుంచి కిందికి దిగి.. పైనుంచి ఏదో పడుతుంది. త్వరగా కార్లను వెనక్కి తీయండి.. బ్యాక్‌ మారో.. బ్యాక్‌ మరో.. ఆయే భాయ్‌, బ్యాక్‌ కరో, బ్యాక్‌ అంటూ ఓ వ్యక్తి కేకలు వేస్తూ పరుగుపెట్టాడు. ఇంకా వస్తున్నాయ్‌.. త్వరగా పదండి అంటూ (ఔర్‌ అయా, హటో, హటో) మరొకరు కేకలు వేయడాన్ని వీడియో చూడవచ్చు. కొన్ని వాహనాలపై బండరాళ్లు, మట్టి పెళ్లలు పడటాన్ని కూడా గమనించవచ్చు. కాగా, కొండచరియలు పడటంతో రోడ్డు ధ్వంసమవడంతో పునరుద్ధరున పనులు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ఆ మార్గం గుండా వాహనాలను బుధవారం నుంచి అనుమతించనున్నట్లు తెలుస్తున్నది.

Tags

Next Story