Gujarat: 36 గంటలపాటు చెక్కబల్లే ఆసరా,,

సముద్రంలో గల్లంతైన 38 గంటల తరువాత బాలుడు సజీవంగా దొరికిన ఘటన గుజరాత్లో జరియింది. 14 సంవత్సరాల బాలుడు అప్పటికే కనపడకుండా పోయి 30 గంటలు గడిచిపోయాయి. తల్లిదండ్రులు అతడిపై ఆశలు వదులుకున్నారు. కానీ, ఇంతలో అద్భుతం జరిగింది. చెక్కబల్లపై తేలుతున్న ఆ బాలుడిని గుర్తించిన కొందరు జాలరులు అతడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. సూరత్ నగరంలో వెలుగు చూసిందీ ఘటన.
పూర్తి వివరాల్లోకి వెళితే, సూరత్‌కు చెందిన వికాస్ అనే బాలుడు మూడు రోజుల క్రితం తన స్నేహితుడు లక్ష్మణ్‌తో కలిసి స్థానిక డుమాస్ బీచ్‌కు వెళ్లాడు. కొద్దిసేపు వారు ఆటలాడాక అకస్మాత్తుగా అలలు విరుచుకుపడటంతో ఇద్దరూ సముద్రంలోకి కొట్టుకుపోయారు. స్థానికులు లక్షణ్‌ను రక్షించగా వికాస్ జాడ మాత్రం తెలియరాలేదు. అతడి కోసం ఎంత ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు.. సముద్రంలో కొట్టుకుపోతున్న బాలుడు తీరానికి 18 నాటికల్ మైళ్ల దూరంలో 'నవదుర్గ' అనే మత్స్యకార పడవను గుర్తించి చేయి ఊపాడు. దీంతో మత్స్యకారులు అతడిని రక్షించి పడవలో ఎక్కించారు. చివరికి లఖన్‌ను నవ్‌సారిలోని ధోలీ పోర్ట్‌కు తీసుకెళ్లారు, అక్కడ పోలీసులు మరియు 108 అత్యవసర అంబులెన్స్ సిబ్బంది అతనిని బయటకు తీశారు. అతనిని ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాల తాలూకు చెక్కబల్ల ఒకటి నీటిపై తేలడంతో దాని సాయంతో బాలుడు 36 గంటల పాటు సముద్రంలో మునిగిపోకుండా తనని తాను కాపాడుకున్నట్టు చెబుతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com