Bengaluru: కుమార్తె చనిపోయి దుఃఖంలో ఉంటే.. లంచాల కోసం అధికారుల వేధింపులు

బెంగళూరుకు చెందిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) రిటైర్డ్ అధికారికి చెందిన హృదయ విదారక సోషల్ మీడియా పోస్ట్ వేలాది మందిని కదిలించింది. తన ఏకైక కుమార్తె మరణంతో బాధతో అల్లాడిపోయిన ఆయన.. అడుగడుగునా లంచాలు చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతని పేరు కె. శివకుమార్. BPCL మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా పరిచయం చేసుకున్నారు. అయితే.. తన 34 ఏళ్ల కుమార్తె అక్షయ మరణించింది. గోల్డ్‌మన్ సాచ్స్‌లో ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన అక్షయ, 11 సంవత్సరాలు సెప్టెంబర్ 18, 2025న మెదడు రక్తస్రావం కారణంగా ఇంట్లోనే మరణించింది. ఆమె కంప్యూటర్ సైన్స్‌లో బి.టెక్ డిగ్రీ, ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ పట్టా పొందింది. తన కుమార్తె మరణాంతరం.. తాను ఎదుర్కొన్న అవినీతి గురించి మీడియా ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు శివకుమార్..
తన కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లే అంబులెన్స్ నుంచి పోలీసు అధికారులు, శ్మశానవాటిక సిబ్బంది, బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) కార్యాలయం వరకు దాదాపు అందరికీ లంచం ఇవ్వాల్సి వచ్చిందని శివకుమార్ పేర్కొన్నారు. అవసరమైన ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి, మరణ ధృవీకరణ పత్రం పొందేందుకు అన్ని చోట్ల లంచం ఇచ్చానని వాపోయారు. “ఇటీవల, నా ఏకైక కుమార్తె 34 సంవత్సరాల వయసులో మరణించింది. అంబులెన్స్, ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం నివేదిక కోసం పోలీసులకు, రసీదు కోసం శ్మశానవాటిక వద్ద, మరణ ధృవీకరణ పత్రం కోసం బీబీఎంపీ కార్యాలయం ఇలా అని స్థలాల్లో బహిరంగంగా లంచాలు డిమాండ్ చేశారు” అని శివకుమార్ రాసుకొచ్చారు. ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం నివేదిక కాపీలను అందించిన పోలీసులకు సైతం తాను లంచం ఇచ్చానని తెలిపాడు. పోలీస్ స్టేషన్‌లో అందరి ముందు ఇచ్చానన్నారు. ఏకైక బిడ్డను కోల్పోయిన నా పట్ల ఎవ్వరికీ సానుభూతి లేదు. ఇది చాలా విచారకరం. నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను ఇచ్చాను. పేదలు పరిస్థితి ఏంటి..? అని నిలదీశారు. ప్రభుత్వాన్ని, పలువురు ప్రముఖులపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ పోస్ట్ విస్తృతంగా వైరల్ అయ్యింది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
శివకుమార్ పోస్ట్‌లో వివరించిన సంఘటనకు సంబంధించి.. బెల్లందూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక PSI, మరో పోలీస్ కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు శాఖ ఎటువంటి దుష్ప్రవర్తన లేదా అనుచిత ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇంతలో తన కుమార్తె మరణం తర్వాత అవినీతి గురించి సోషల్ మీడియాలో భావోద్వేగంతో చేసిన K. శివకుమార్ పోస్ట్‌లపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాళవిక అవినాష్ సానుభూతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

