పాక్ అదుపు నుంచి విడుదలై స్వదేశానికి తిరిగి వచ్చిన బీఎస్‌ఎఫ్ జవాన్

పాక్ అదుపు నుంచి విడుదలై స్వదేశానికి తిరిగి వచ్చిన బీఎస్‌ఎఫ్ జవాన్
X

సరిహద్దు రక్షణ బలగం (బీఎస్‌ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా (40) మళ్లీ స్వదేశ గడ్డపై అడుగుపెట్టారు. పాకిస్థాన్ రేంజర్స్ అదుపులో ఉన్న ఈ ధీర జవాన్‌ను బుధవారం ఉదయం 11 గంటల సమయంలో పంజాబ్‌లోని అటారీ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద భారత్‌కు అప్పగించారు ఏప్రిల్ 23న ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో విధులు నిర్వహిస్తుండగా, పొరపాటున సరిహద్దు దాటిన షాను పాక్ రేంజర్స్ అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనకు ఒక్క రోజు ముందు జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశాన్ని కలవరపెట్టింది. 26కన్నా ఎక్కువగా పర్యాటకులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి షా విడుదల కోసం బీఎస్‌ఎఫ్ అధికారులు పాక్ రేంజర్స్‌తో ఫ్లాగ్ మీటింగ్‌ల ద్వారా చర్చలు జరిపినా ఉగ్రదాడి తర్వాత వాతావరణం సహకరించలేదు.

మే 7న భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఈ ఆపరేషన్‌లో తొమ్మిది కీలక కేంద్రాలు ధ్వంసమయ్యాయి ఈ సైనిక చర్య సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలను మరింత పెంచినప్పటికీ దౌత్యపరమైన ప్రయత్నాలు ఆగలేదు. మే 10న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయంతో భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం షా విడుదలకు మార్గం సుగమం చేసింది అటారీ వద్ద జరిగిన అప్పగింత సందర్భంగా షా సురక్షితంగా తిరిగి వచ్చిన క్షణం భారత సైనిక బలగాలకు ఉత్సాహాన్నిచ్చింది.

బీఎస్‌ఎఫ్ అధికారుల మాటల ప్రకారం షా ఆరోగ్యం బాగుంది త్వరలో అతను తన కుటుంబంతో సంతోషంగా కలుస్తారని వారు చెప్పారు. పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై గట్టి వైఖరి తీసుకుంది ఈ సందర్భంలో షా తిరిగి రాక సైనికుల సంకల్పానికి ఒక నిదర్శనంగా నిలిచింది.

సరిహద్దు ప్రాంతంలో శాంతి నెలకొనాలని ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ మంగళవారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో డ్రోన్ కదలికలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీటిని భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయడానికి నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి

Tags

Next Story