Budget 2025: రూ. 50.65 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్

Budget 2025: రూ. 50.65 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్
X
రక్షణ, గ్రామీణాభివృద్ధికి భారీగా కేటాయింపులు.. బిహార్కు బడ్జెట్లో వరాల జల్లు...

'వికసిత్ భారత్' సాధించడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రూ. 50.65 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ను సభ ముందు ఉంచారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి తీసుకొని లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 'వికసిత్ భారత్' లక్ష్యంగా మనం ముందుకు వెళ్తున్నామని.. ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి చెప్పారు.

కీలక కేటాయింపులు ఇవే..

రక్షణశాఖ: రూ. 4,91,732 కోట్లు

గ్రామీణాభివృద్ధి: రూ.2,66,817 కోట్లు

హోంశాఖ: రూ. 2,33,211 కోట్లు

వ్యవసాయ, అనుబంధ రంగాలు: రూ.1,71,437 కోట్లు

విద్య: రూ.1,28,650 కోట్లు

ఆరోగ్యం: రూ.98,311 కోట్లు

విద్యుత్: రూ.81,174 కోట్లు

సామాజిక సంక్షేమం: రూ. 60.052 కోట్లు

వైజ్ఞానిక విభాగాలు: రూ. 55,679 కోట్లు

పట్టణాభివృద్ధి: రూ. 96, 777 కోట్లు

ఐటీ టెలికాం: రూ. 95, 298 కోట్లు

వాణిజ్య పరిశ్రమలు: రూ. 65, 553 కోట్లు

బడ్జెట్ లో కీలక అంశాలు ఇవే

రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్

ఎగుమతులపై స్పెషల్ ఫోకస్

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు

దేశీయంగా తయారీ పరిశ్రమలకు మద్దతు

200 జిల్లాల్లో క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు

పట్టణ పేదలు, వర్తకులకు చేయూత

విద్యారంగంలో సంస్కరణలు

సూక్ష్మ. మధ్య తరహా పరిశ్రమలకు క్రెడిట్ కార్డులు

మహిళల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.2కోట్ల రుణాలు

పత్తి రైతులకు బడ్జెట్ లో భారీ శుభవార్త

ఆర్థికమంత్రి నిర్మలా ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్ లో పత్తి రైతులకు శుభవార్త చెప్పారు. పత్తి ఉత్పాదకత కోసం ప్రత్యేక మిషన్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇది పత్తి రైతుల ఆదాయాన్ని మెరుగుపరుస్తుందన్నారు. సంప్రదాయ వస్త్ర రంగాన్ని పునరుజ్జీవమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. పత్తి వ్యవసాయం ఉత్పాదకత, స్థిరత్వాన్ని గణనీయంగా మెరుగుపరచడానికి రాబోయే 5 ఏళ్లు లక్ష్యంగా పెట్టుకొని మిషన్ పనిచేస్తుందని తెలిపారు.

Tags

Next Story