Supreme Court : బుల్డోజర్ యాక్షన్ రాజ్యాంగ విరుద్ధం : సుప్రీంకోర్టు

Supreme Court : బుల్డోజర్ యాక్షన్ రాజ్యాంగ విరుద్ధం : సుప్రీంకోర్టు
X

ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న బుల్డోజర్ యాక్షన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలు వరించింది. బుల్డోజర్ యాక్షన్ రాజ్యాంగ విరుద్దమని, ప్రాథమిక హక్కుల ఉల్లం ఘన కిందకు వస్తుందని పేర్కొంది. ఒక కార్యనిర్వాహక అధికరి న్యాయమూర్తి కాలేడని తెలిపింది. ఇంటిని కూల్చివేయ డం వల్ల నిందితుడి కుటుంబం, భార్య, పిల్లలు నిరాశ్రయులవుతారని పేర్కొంది. ఇది సమర్థనీయం కాదని తెలిపింది. కూ ల్చివేసిన ఇండ్లకు పరిహారం ఇవ్వాలని సూచించింది. నిందితుడు దోషిగా తేలక ముందే అధికారులు ఇండ్లను కూల్చివేయ డం సరికాదని తెలిపింది. బుల్డోజర్ చర్య లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనా థన్లతో కూడిన ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనేది ఒక కల అని, ఎగ్జిక్యూటివ్ ్ను ఆశ్రయం తీసుకోవడానికి అనుమతించా లా అనేది కోర్టు ముందున్న ముఖ్యమైన ప్రశ్న అని జస్టిస్ గవాయ్ అన్నారు. కార్యా నిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థలు వేరని, కార్య నిర్వాహక వ్యవస్థ న్యాయవ్య వస్థ పనులు చేయొద్దని అన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని తెలిపారు. నిందితుడా? కాదా..? అని తేలకముందే ఇల్లు కూల్చివేయడమంటే విచారణ లేకుండానే జరిమానా విధించి నట్టుగా భావించాల్సి వస్తుందన్నారు. ఒక వ్యక్తి మాత్రమే నిందితుడిగా ఉన్నట్లయితే, అధికారులు ఒక ఇంటిని పడగొట్టి, దాని నిర్వాసితులకు ఆశ్రయం లేకుండా చేయ గలరా? అని కూడా కోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం దాని అధికారాలను ఉపయోగించి, కూ ల్చివేతలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిర్దేశించింది. షోకాజ్ నోటీసు లేకుండా కూల్చివేతలు చేపట్టరాదని పేర్కొంది. మున్సిపల్ చట్టాలు కూడా రాజ్యాంగానికి లోబడి ఉండాలని తెలిపింది. కూల్చివేతల కు 15 రోజుల ముందస్తు నోటీసులు తప్ప నిసరిగా ఇవ్వాలని పేర్కొంది. నోటీసుల ను తప్పనిసరిగా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలని, వాటిని ఆ ఇంటి పై అతికించా లని సూచించింది. నోటీసులను మూడు నెలల్లోపు డిజిటల్ పోర్టల్లో ఉంచాలని ఆదేశించింది. కూల్చివేతలు తప్పనిసరి అయితే దానికి తగిన కారణాలు చెప్పాల ని, మొత్తం కులుస్తున్నారా, కొంత భాగం కూలుస్తున్నారా అనేది వివరించాలని, అప్పీలుకు 15 రోజుల సమయం ఇవ్వాల నిసూచించింది. తమకు తాము అక్రమ ని ర్మాణాలు కూల్చేందుకు అవకాశం ఇవ్వా లని తెలిపింది. కూల్చివేతలను తప్పనిసరి గా వీడియోగ్రఫీ చేయాలని సూచించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కా రంగా పరిగణిస్తామని పేర్కొంది. అధికా రుల జీతం నుంచి జరిమానాలు వసూలు చేస్తాము' అంటూ వార్నింగ్ ఇచ్చింది.

Tags

Next Story