Bus Fire : బస్సు ప్రమాదంలో 12 మంది సజీవదహనం

మరో 17 మందికి గాయాలు

మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. గుణ నుంచి ఆరోన్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. ట్రక్కును ఢీ కొట్టింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని గుణా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణీకుల బస్సులో మంటలు చెలరేగడంతో 13 మంది మరణించారు. ఈ బస్సు ప్రమాద ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు. గుణ-ఆరోన్ రహదారిపై డంపర్‌ను ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఈ ప్రమాదంలో మరో 17 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బస్సు- ట్రక్కు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారని గుణ జిల్లా కలెక్టర్ తరుణ్ రాఠీ తెలిపారు. మంటల్లో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, వాటిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రమాద స్థలం నుంచి అన్ని మృతదేహాలను తొలగించామని, ప్రమాదానికి కారణాన్ని కనుగొనడానికి దర్యాప్తు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ప్రమాద ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వారిలో నలుగురు ఎలాగోలా బస్సులోంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్లిపోయారని పోలీసులు వివరించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 సహాయం ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story