Online Scam: డేటింగ్‌ యాప్‌లో పరిచయమై, రూ.6.3 కోట్లకు టోకరా

Online Scam:    డేటింగ్‌ యాప్‌లో పరిచయమై, రూ.6.3 కోట్లకు టోకరా
X
డేటింగ్‌ యాప్‌లో మహిళ చీటింగ్‌

డేటింగ్‌ యాప్‌లో ఒక మహిళ వలలో చిక్కి ఒక ఉన్నతోద్యోగి రూ.6.3 కోట్లు పోగొట్టుకున్నాడు. నోయిడాకు చెందిన దల్జీత్‌ సింగ్‌కు ఒక డేటింగ్‌ యాప్‌లో అనిత పేరుతో ఒక మహిళ పరిచయమైంది. ఆ పరిచయం బలపడి స్నేహంగా మారింది. ఆ మహిళ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మించడంతో దల్జీత్‌ తొలుత ఆమె సూచించిన మూడు వెబ్‌సైట్లలో 3.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. గంటల వ్యవధిలోనే రూ.24 వేలు లాభం రావడంతో ఆ తర్వాత ఆమె సలహాపై రూ.6.5 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అయితే తర్వాత వాటిని విత్‌ డ్రా చేసేందుకు వీలు కాకపోవడం, ఆ వెబ్‌సైట్‌లు పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tags

Next Story