Byju’s CEO gave a big hope their Employees

Byju’s  CEO gave a big hope their Employees
X

ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ సహ వ్యవస్థాపకుడు , CEO రవీంద్రన్ వర్చువల్ టౌన్ హాల్‌లో ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు.

బైజూస్ కంపెనీ బలంగానే ఉందని, అది స్థిరంగానే ముందుకు సాగుతుందని తెలిపారు.

బైజూస్ సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి మరో 1,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి నిరసన గా

ఉద్యోగులకు, యాజమాన్యానికి మధ్య సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నాయి.

ఈ విషయంపైన గురువారం మాట్లాడుతూ

బైజూస్ బహుళ సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో, కంపెనీ తిరిగి పుంజుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామని, ఉద్యోగులు భయపడాల్సిన పనిలేదని బైజూస్ CEO, ఏడ్టెక్ దిగ్గజం రవీంద్రన్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

కంపెనీ చరిత్ర లోనే చాలా కష్టతరమైన సంవత్సరం అని అంగీకరించాడు. ప్రధానంగా సాంకేతికత, అభ్యాసం గురించి మాట్లాడాడు.

అనుకోని విధగా చేసినకొన్ని కొనుగోళ్ళ లావాదేవీల వలన జరిగిన తప్పుల వలన బైజుస్ కంపెనీ ప్రయాణం సంక్షోభంలో చిక్కుకుందని, ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని, పరిష్కరించడానికి సంస్థ కృషి చేస్తోందని తెలిపారు.

ఆరు నెలల క్రితంతో పోలిస్తే స్టార్టప్ మరింత సమర్థవంతంగా పని చేస్తుందని అన్నారు

Next Story