Lok Sabha Elections: రెండో విడత పోలింగ్‌కు జోరుగా ఏర్పాట్లు

సార్వత్రిక ఎన్నికల సమరంలోరెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్‌సభ స్థానాలకుశుక్రవారం పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఈ దశ పోలింగ్‌లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే ప్రచార గడువు ముగియడంతో మైకులన్నీ మూగబోయాయి. తమ ఓటును ఈవీఎంలలో నిక్షిప్తం చేసేందుకు ఓటర్లు కూడా సిద్ధంగా ఉన్నారు.
18వ లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ దశలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 స్థానాలు ఉండగా.. అందులో తొలి 14 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లోని 13 ఎంపీ స్థానాలకు కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది. రాజస్థాన్‌లో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉండగా తొలి దశలో 12 సీట్లకు పోలింగ్ జరిగింది. వీటితోపాటుఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రలో ఎనిమిదేసి, అసోం, బిహార్‌లో ఐదేసి, మధ్యప్రదేశ్‌లో ఆరు, బంగాల్, ఛత్తీస్‌గఢ్‌లో మూడేసి, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లో ఒక్కొ స్థానానికి పోలింగ్ జరగనుంది.
కేరళలో ఉన్న మొత్తం 20 లోక్‌సభ నియోజక వర్గాలకుఈ దశలో ఒకేసారి పోలింగ్ జరగనుంది. కేరళలోని 20 స్థానాలకు 194 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. CPM నేతృత్వంలోని అధికార LDF కాంగ్రెస్ నేతృత్వంలోని UDF... భాజపా నేతృత్వంలోని NDAలు కేరళలో అత్యధిక స్థానాలు దక్కించుకోవాలని, ముమ్మరంగా ప్రచారం చేశాయి.
కేరళలోని వయానాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో ఉండడంతో దేశం చూపు ఈ స్థానంపైనే ఉంది. వయనాడ్ నుంచి రాహుల్‌కు ప్రత్యర్థులుగా సీపీఎం నుంచి అన్నీ రాజా కేరళ భాజపా అధ్యక్షుడు సురేంద్రన్ బరిలో ఉన్నారు. తిరువనంతపురం నుంచి ప్రస్తుత ఎంపీ కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ పోటీ పడుతుండగా... కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఇక్కడ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
దక్షిణ కన్నడలోని 14 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 247 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, భాజపా-JDS కూటమి మధ్య పోరు భీకరంగా..ఉంది. ఈ 14 స్థానాల్లో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా, భాజపా 11 స్థానాల్లో, జేడీఎస్ మూడు స్థానాల్లో పోటీ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన భాజపా, జేడీఎస్ కలిసి బరిలోకి దిగాయి. కాంగ్రెస్ ఒంటరిగానే నిలిచింది. మండ్య నుంచి మాజీ సీఎం కుమార స్వామి బరిలో ఉండటంతో పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారింది. మైసూరు-కొడగు స్థానం నుంచి మైసూరు యువరాజు యదువీర్ ఒడెయార్ స్వయంగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరపున లక్ష్మణ్ ఎన్నికల బరిలో..... నిలిచారు. దేవేగౌడ మనవడు రేవణ్ణ హసన్ నుంచి ఎన్నికల బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సోదరుడు.... డీకే శివకుమార్ బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com