Kachchchatheevu: కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చేసింది కాంగ్రెస్ ..మోదీ

Kachchchatheevu: కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చేసింది కాంగ్రెస్ ..మోదీ
దేశ సమగ్రత, ప్రయోజనాలను కాంగ్రెస్ బలహీనం చేసిందన్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కచ్చతీవు ద్వీపం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మోదీ ఎండగట్టారు. 1970లో కాంగ్రెస్‌ పార్టీ కచ్చతీవు ద్వీపాన్ని పొరుగు దేశం శ్రీలంకకు నిర్మొహమాటంగా ఇచ్చేయాలని కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ.. దేశ సమగ్రత, సమైక్యత, ప్రయోజనాలను కాంగ్రెస్‌ పార్టీ బలహీన పరుస్తూ వచ్చిందని ‘ఎక్స్‌’వేదికగా ధ్వజమెత్తారు.

1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని ఆర్టీఐ నివేదిక వెల్లడించింది. ఈ చర్చ ఆశ్చర్యకరమైనదని, దేశ ప్రజలకు కోపాన్ని తెప్పించిందని, కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ నమ్మలేదని ప్రధాని మోడీ అన్నారు. ‘‘కచ్చతీవుని కాంగ్రెస్ ఎంత నిర్ద్వంద్వంగా వదులుకుందో వెల్లడిస్తుంది. ఇది ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది. మేము కాంగ్రెస్‌ని ఎప్పటికీ విశ్వసించలేము. 75 ఏళ్లుగా భారతదేశ ఐక్యత, సమగ్రత మరియు ప్రయోజనాలను బలహీనపరచడం కాంగ్రెస్ పని విధానం.’’ అని పీఎం మోడీ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.

భారత్‌కి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించడంతో ఆ ప్రాంత సమీపానికి వెళ్తున్న తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేస్తోంది. పాక్ జలసంధిలో భూభాగాన్ని పొరుగు దేశానికి అప్పగించాలని 1974లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే. అన్నామలై సమాచారహక్కు పిటిషన్ ద్వారా ఈ నిజం వెలుగులోకి వచ్చింది.

తమిళనాడు జాలర్లు దేశానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వీపానికి సంచరిస్తున్నప్పుడు వారిని బంధించి జైళ్లలో పెట్టడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది పేర్కొన్నారు. ఈ ద్వీపం 1975 వరకు భారత్‌లో ఉందని ఆయన చెప్పారు. అయితే, లంకతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందం వల్ల మన జాలర్లను అక్కడికి రాకుండా అడ్డుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అయితే, డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఈ అంశాన్ని లేవనెత్తడం లేదని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story