Blackout Drill: పంజాబ్ ఫిరోజ్‌పూర్‌లో బ్లాకవుట్‌ డ్రిల్‌

Blackout Drill: పంజాబ్ ఫిరోజ్‌పూర్‌లో బ్లాకవుట్‌ డ్రిల్‌
X
పాకిస్తాన్‌తో ఉద్రిక్తల నడుమ సైన్యం కీలక డ్రిల్..

పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో, ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ఆర్మీ కంటోన్మెంట్‌లో ఆదివారం రాత్రి ‘‘బ్లాక్అవుట్ డ్రిల్’’ నిర్వహించారు. పూర్తిగా లైట్లు ఆర్పేసి, ఎలాంటి వెలుతురు లేకుండా సైన్యం ఈ వ్యాయామంలో పాల్గొంది. తన యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకుంది. బ్లాక్అవుట్ డ్రిల్ సక్సెస్ కావడానికి ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఫిరోజ్‌పూర్ డిప్యూటీ కమిషన్ మద్దతు, సహకారాన్ని కోరారు. డ్రిల్ నిర్వహించిన సమయంలో, రాత్రి 9 గంటల నుంచి 9.30 వరకు అరగంట పాటు విద్యుత్ నిలిపేయాలని పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL)ని సైనిక అధికారులు కోరారు.

పాకిస్తాన్ నుంచి వస్తున్న యుద్ధ బెదిరింపుల దృష్ట్యా భారత సైన్యం కంటోన్మెంట్ లో ఆదివారం అరగంట పాటు పూర్తి బ్లాక్అవుట్ రిహార్సల్ జరిగిందని అధికారులు తెలిపారు. ఈ డ్రిల్‌కి సైనికాధికారులు స్థానికుల మద్దతు కోరారు. ఎలాంటి వెలుతురు లేకుండా ఉండేందుకు ఇన్వర్టర్లు, జనరేటర్ లైట్లు లేకుండా చూసుకోవాలని స్థానికుల్ని కోరారు. పాకిస్తాన్‌కి సరిహద్దు ప్రాంతంలోనే ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ ఉంటుంది. పాకిస్తాన్‌పై సైనిక దాడికి అవకాశం ఉందనే ఊహాగానాల మధ్య ఈ బ్లాక్అవుట్ రిహార్సల్స్ జరిగాయి.

Tags

Next Story