TVK Chief: టీవీకే చీఫ్ విజయ్ కి షాక్ ఇచ్చిన అభిమాని..

సినీ నటుడు, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ పై కేసు నమోదు అయింది. తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్‌కుమార్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు. దళపతి విజయ్ ని కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకున్న బౌన్సర్లు తనపై దాడికి పాల్పడ్డారని అతడు ఆరోపించారు. దీంతో పోలీసులు విజయ్, ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేశారు.
టీవీకే పార్టీ రెండో వార్షిక సమావేశం సందర్భంగా మధురైలో ఏర్పాటు చేసినా మహాసభ వేదికగా ప్రత్యేకంగా భారీ ర్యాంప్ నిర్మించారు. దళపతి విజయ్ ర్యాంప్‌పై నడుస్తూ అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ఈ సమయంలో ఆయనను కలిసేందుకు కొంతమంది అభిమానులు ర్యాంప్‌పైకి ఎక్కారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో వారిని కిందకు తోసేశారు బౌన్సర్లు.
పెరంబలూరు జిల్లా, పెరియమ్మాపాళయం గ్రామానికి చెందిన శరత్‌కుమార్ అనే అభిమాని దళపతి విజయ్ ని కలిసేందుకు ర్యాంప్‌పైకి ఎక్కాడు. ఈ సమయంలో విజయ్ బౌన్సర్లు అతనిని గట్టిగా పట్టుకొని కిందికి విసిరేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విజయ్ బౌన్సర్ల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అభిమాని శరత్‌కుమార్, ఆయన తల్లి సంతోషం ఇద్దరూ మదురై జిల్లా అదనపు ఎస్పీ బాలమురుగన్‌కి ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ఆధారంగా విజయ్ తో పాటు 10మంది బౌన్సర్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com