Caste Census : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. ‘కుల గణనే’: రాహుల్‌

Caste Census : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. ‘కుల గణనే’: రాహుల్‌
బీజేపీ ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వంపై

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. యూపీఏ హయాంలో నిర్వహించిన కుల గణనను ఎందుకు విడుదల చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆవాస్ న్యాయ సమ్మేళన్‌లో పాల్గొన్న రాహుల్ భాజపాపై విరుచుకపడ్డారు. తమ పార్టీ రీమోట్‌ కంట్రోల్‌ను నొక్కితే సంక్షేమ ఫలాలు నిరుపేదలకు చేరతాయన్న రాహుల్‌ అదే భాజపా రీమోట్‌ కంట్రోల్‌ నొక్కితే అదానీకి విమానాశ్రయాలు, పోర్టులు, కాంట్రాక్టులు వస్తాయని విమర్శించారు. ప్రభుత్వాన్ని కేబినెట్‌ క్యార్యదర్శులు, కార్యదర్శులే నడుపుతారని ఎంపీలు, ఎమ్మెల్యేలు కాదని అన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని 90 మంది కార్యదర్శులలో ముగ్గురు మాత్రమే OBCలు ఉన్నారని పునరుద్ఘాటించారు. కేంద్ర బడ్జెట్‌లో ఐదు శాతాన్ని మాత్రమే వీరు నియంత్రిస్తున్నారన్న రాహుల్ దేశంలో ఐదు శాతమే ఓబీసీలు ఉన్నారా అని ప్రశ్నించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డరాహుల్ గాంధీ యూపీఏ హయాంలో నిర్వహించిన కుల గణన వివరాలను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామన్నారు. జనాభా దామాషా ప్రకారం ఓబీసీలు సక్రమంగా భాగస్వామ్యమయ్యేలా చూడాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ కోరారు. దేశంలో కుల గణన నుంచి దృష్టి మరల్చడానికే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చారని కాంగ్రెస్ అగ్ర నేత వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే గతంలో చేసిన జనాభా గణాంకాల వివరాలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.అదేవిధంగా ఓబీసీలు, ఇతర బలహీన వర్గాల జనాభాను నిర్ధారించేందుకు తాజాగా కుల గణన చేపట్టాలని పేర్కొన్నారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్ధతు ఇస్తుందని స్పష్టం చేశారు.

Tags

Next Story