RAHUL CSAE: సుప్రీంకోర్టులో రాహుల్‌కు వ్యతిరేకంగా కేవియట్‌

RAHUL CSAE: సుప్రీంకోర్టులో రాహుల్‌కు వ్యతిరేకంగా కేవియట్‌
రాహుల్‌గాంధీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం... కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన పూర్ణష్‌ మోదీ... తీర్పునకు ముందు తమ వాదన వినాలని విజ్ఞప్తి...

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ(rahul gandhi) పరువు నష్టం కేసులో కీలక పరిణామం సంభవించింది. ఈ కేసులో సుప్రీంకోర్టులో కేవియట్‌‌(caveat) పిటిషన్ దాఖలైంది. పరువునష్టం (defamation case) కేసులో తమ వాదన వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దంటూ గుజరాత్‌ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court)లో కేవియట్‌ దాఖలు చేశారు. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన గుజరాత్ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాహుల్‌గాంధీ (rahul) సుప్రీంకోర్టుకు వస్తే తమ వాదన వినాలని పూర్ణేష్‌ మోదీ సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేశారు. తమ వాదన వినకుండా తమకు వ్యతిరేకంగా ఎటువంటి ప్రతికూల ఉత్తర్వులు జారీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.


మోదీ పేరుపై విమర్శలు చేసినందుకు గానూ సూరత్‌ కోర్టు రాహుల్‌ గాంధీని దోషిగా తేలుస్తూ ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీనిపై రాహుల్‌ గుజరాత్‌ హైకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా ఎదురుదెబ్బ తలిగింది. కింద కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేయడానికి గుజరాత్‌ హైకోర్టు(Gujarat High Court) నిరాకరించింది. రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ హేమంత్‌ ప్రచ్ఛక్‌ తోసిపుచ్చారు. శిక్షను నిలుపుదల చేయడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని అన్నారు. రాహుల్‌ గాంధీకి కింద కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష సరైనదేనని గుజరాత్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది.


2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటుందో అంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ సూరత్‌ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన ట్రయల్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే.

గుజరాత్‌ హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టులో సవాల్‌ చేస్తామని కాంగ్రెస్‌ (CONGRESS) ఇప్పటికే స్పష్టం చేసింది. రాహుల్‌ అన్నీ నిజాలు మాట్లాడుతూ ఉండడంతో ఆయన గొంతు నొక్కేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నిక్కులు ఉపయోగిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. గుజరాత్‌ హైకోర్టు రాహుల్‌ పిటిషన్‌ను కొట్టేయడం తీవ్ర అసంతృప్తికి లోనుచేసిందని, కానీ తాము ఊహించిన తీర్పే వచ్చిందని వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story