New Delhi : అమ్మకానికి గవర్నర్ సీటు.. గుట్టు రట్టు చేసిన సీబీఐ..

New Delhi : అమ్మకానికి గవర్నర్ సీటు.. గుట్టు రట్టు చేసిన సీబీఐ..
New Delhi : రూ.100 కోట్లకు గవర్నర్‌ను చేస్తామన్న ముఠాను సీబీఐ అరెస్ట్ చేసింది.

New Delhi : అమ్మకానికి ఎంపీ ఎమ్మెల్యే టికెట్లే కాదు.. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ సీట్లు, గవర్నర్ పదవులు కూడా ఉన్నాయి. రూ.100 కోట్లకు రాజ్యసభ సీటు లేదంటే గవర్నర్ సీటు ఇప్పుస్తామని మోసం చేస్తున్న ఓ ముఠాను సీబీఐ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

నాలుగు వారాలుగా ఈ ముఠా గుట్టుచప్పుడు కాకుండా బేరాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులకు సమాచారం ఉంది. ఫోన్ కాల్స్ ద్వారా నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.

ఒక బేరం కుదిరి చేతులు మారుతున్న సమయంలోనే సీబీఐ అధికారులు గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో నలుగురు పట్టుబడ్డారు.. కర్మలాకర్ ప్రేమ్‌కుమార్ బండ్గార్ (మహారాష్ట్ర), రవీంద్ర విఠల్ నాయక్ (కర్ణాటక), మహేంద్ర పాల్, అభిషేక్ బురాగా (ఢిల్లీ). పట్టుబడ్డ నిందితులు గతంలో తాము సీబీఐ అధికారులమని చెప్పి ఉన్నత పోలీస్ అధికారులనే బురిడీ కొట్టించినట్టు తెలుస్తోంది.

Tags

Next Story