Bihar: బిహార్ పట్నాలోని ఆర్జేడీ నేతల ఇళ్లలో సీబీఐ దాడులు..

Bihar: బిహార్ పట్నాలోని ఆర్జేడీ నేతల ఇళ్లలో సీబీఐ దాడులు..
Bihar: నితీష్ సర్కార్‌ బలనిరూపణకు సిద్ధమైన వేళ.. ఇద్దరు సీనియర్ ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ సోదాలు కలకలం రేపుతున్నాయి.

Bihar: బిహార్‌లో నితీష్ సర్కార్‌ బలనిరూపణకు సిద్ధమైన వేళ.. ఇద్దరు సీనియర్ ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ సోదాలు కలకలం రేపుతున్నాయి. యూపీఏ సర్కార్‌లో లాలు ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉండగా జరిగిన ల్యాండ్‌ ఫర్ రైల్వే జాబ్స్‌ కేసుకు సంబంధించి సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ అహ్మద్ అష్ఫక్ కరీం, ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్ ఇళ్లలో సీబీఐ సోదాలు జరుపుతోంది.

ఐతే సోదాలపై సునీల్ సింగ్‌ స్పందించారు. ఉద్దేశపూర్వకంగానే సీబీఐ దాడులు చేస్తున్నారని చెప్పారు. దాడుల భయంతో ఆర్జేడీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారనే ఉద్దేశంతోనే తనిఖీలు నిర్వ హిస్తున్నారని ఆరోపించారు. మరో ఎమ్మెల్సీ సుబోధ్‌ రాయ్‌ ఇంటిలోనూ సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. గత మే నెలలోనూ ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, ఇధ్దరు కుమార్తెలు సహా మరో 12 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది.

రెండు వారాల క్రితం బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ నేత నితీష్ కుమార్‌...ఆర్జేడీతో కలిసి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆగష్టు 10న బిహార్ సీఎంగా ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఇటీవలే మంత్రి వర్గ విస్తరణ చేశారు. లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్‌కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించాడు. ఇవాళ అసెంబ్లీలో బలనిరూపణకు జరగనుంది. ఇలాంటి టైంలో సీబీఐ దాడులు బిహార్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Tags

Next Story