Manish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటి పై సీబీఐ రైడ్..

Manish Sisodia : దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని 21 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేగుతోంది. ఇందులో ఢిల్లీ డిప్యూటీ సీఎం నివాసం కూడా ఉండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై మరోసారి బీజేపీ, ఆప్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నూతన మద్యం పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారని మనీశ్ సిసోడియాపై ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరుగుతున్నాయి.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసం సహా ఏడు రాష్ట్రాల్లోని 21 చోట్ల సీబీఐ మెరుపు దాడులు నిర్వహించింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణ నివాసంలో సోదాలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. సీబీఐ దాడుల గురంచి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సీబీఐకి పూర్తిగా సహకరిస్తానని మనీష్ సిసోడియా వెల్లడించారు.
సీబీఐ దాడులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గతంలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన సోదాల్లో ఏమీ గుర్తించలేకపోయిందన్నారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com