అసంపూర్తిగా ముగిసిన రైతు సంఘాలతో కేంద్రం చర్చలు

అసంపూర్తిగా ముగిసిన రైతు సంఘాలతో కేంద్రం చర్చలు

ప్రతీకాత్మక చిత్రం 

రైతు సంఘాలతో కేంద్రం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దాదాపు 7 గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పటికీ ఎటూ తేలలేదు.ఎల్లుండి మరోసారి చర్చలు కొనసాగనున్నాయి..చట్టంలోని వివిధ అంశాలను రైతులకు వివరించే ప్రయత్నం చేసింది కేంద్రం. అభ్యంతరకర అంశాలపై సవరణలకు సిద్ధమని తెలిపింది. అయితే వ్యవసాయ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమని వాదించారు రైతులు. చట్టాలను వెనక్కి తీసుకోవడం ఒక్కటే పరిష్కారమని రైతు సంఘాలు తెగేసి చెప్పాయి. దీంతో తదుపరి నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలని కోరింది ప్రభుత్వం. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు మరోసారి చర్చలు జరగనున్నాయి. అయితే అప్పటి వరకు ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.. ఇతర రాష్ట్రాల రైతులు కూడా తోడవడంతో అన్నదాతల ఆందోళన మరింత ఉద్ధృతమైంది.

కేంద్ర వ్యవసాయ చట్టంలోని అంశాలు... కార్పొరేట్ శక్తులకు మాత్రమే లబ్ది చేకూర్చేలా ఉన్నాయంటున్నారు రైతు సంఘాల నేతలు. వ్యవసాయ చట్టాలను విరమించుకునే వరకు ఉద్యమిస్తామంటున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే దేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

Tags

Next Story