Cabinet Meet: నేడు కేంద్ర మంత్రిమండలి భేటీ, పలువురికి ఉద్వాసన తప్పదా.!

Cabinet Meet: నేడు కేంద్ర మంత్రిమండలి భేటీ, పలువురికి ఉద్వాసన తప్పదా.!

ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి భేటీ కానుంది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే భాజపా పార్టీలో నాయకత్వ బాధ్యతలపై కూడా చర్చ జరగనుంది. నిన్న, నేడు మొత్తం పలువురు కేంద్ర మంత్రులు, భాజపా కీలక నేతలతో భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భాజపా నేతలతో సమావేశంలో తలమునకలయ్యారు. నేడు భాజపా కేంద్ర కార్యాలయం వద్ద కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, భూపేంద్ర యాదవ్, కిరేణ్ రిజుజు, గజేంద్ర సింగ్ షెకావత్‌లు, అర్జున్‌ రాం మేఘ్వాల్‌లు పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కనబడ్డారు.


పలువురు కేంద్ర మంత్రులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నారు. రాజస్థాన్ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి షేకావత్ మధ్యప్రదేశ్ పార్టీ బాధ్యతలు నరేంద్ర సింగ్ తోమర్‌కు, ఒరిస్సా పార్టీ బాధ్యతలు ధర్మేంద్ర ప్రధాన్‌కు అప్పగిస్తానని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల భాజపా అధ్యక్షులను మార్చారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి తెలంగాణ భాజపా అధ్యక్ష పదవి ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్‌కి పురంధరేశ్వరికి పగ్గాలు అప్పగించారు. ఈ నేపథ్యంలో నిన్నటి దాకా తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌కి కేబినేట్‌లోకి పిలుపు రానుందనే వార్తలు వినబడుతున్నాయి.

వచ్చేది ఎన్నికల సమయం కాబట్టి మార్పులు తథ్యంగా భావిస్తున్నారు. కేంద్ర మంత్రులంతా ఆయా రాష్ట్రాల్లో పార్టీ విజయాలకి కృషి చేయాల్సింగా ఆదేశించనున్నారు. అంతే కాకుండా పనితీరు బాగాలేని పలువురు మంత్రులకు ఉద్వాసన కూడా తప్పదంటున్నారు.




Tags

Read MoreRead Less
Next Story