Cabinet Ministers Of India 2024 : సీనియర్లకు పాత శాఖలే , 12 మందికి యథాతథం

Cabinet Ministers Of India 2024 : సీనియర్లకు పాత శాఖలే , 12 మందికి యథాతథం
హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖలకు గత ప్రభుత్వ మంత్రులే కొనసాగింపు

కేంద్ర మంత్రులకు సోమవారం శాఖలను కేటాయించారు. హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ వంటి కీలక శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయా శాఖలకు గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌, జై శంకర్‌లనే కొత్త ప్రభుత్వంలోనూ ప్రధాని మోదీ కొనసాగించారు. ఈ నలుగురు మంత్రులే ప్రధాని నేతృత్వంలో ఉండే భద్రతా వ్యవహరాల క్యాబినెట్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు. నితిన్‌ గడ్కరీకి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖను కొనసాగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గతంలో చేసిన ఆరోగ్య శాఖను తిరిగి పొందారు. గత ప్రభుత్వంలో స్మృతి ఇరానీ నిర్వర్తించిన మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖను అన్నపూర్ణా దేవికి ఇచ్చారు. ఈ మేరకు మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలతో కూడిన జాబితాను రాష్ట్రపతి కార్యాలయం సోమవారం విడుదల చేసింది.

ప్రధాని మోదీ వద్దనున్న శాఖలు : సిబ్బంది వ్యవహారాలు, పించన్లు, పబ్లిక్‌ గ్రీవెన్స్‌, అణు శక్తి, అంతరిక్షం, కీలక విధాన సంబంధిత అంశాలతోపాటు ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు.

గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారిలో కొంత మందికి అదనపు శాఖలు కేటాయించగా, మరికొంత మందికి శాఖల్లో కోత విధించారు. అశ్వినీ వైష్ణవ్‌కు రైల్వే శాఖతోపాటు కీలకమైన ప్రసార శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు. హర్దీప్‌ సింగ్‌ పురీ నిర్వర్తించిన శాఖల్లో గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖను ఆయన నుంచి ఈసారి తీసేసుకొన్నారు. కిరణ్‌ రిజిజును ఎర్త్‌ సైన్సెస్‌ నుంచి పార్లమెంటరీ వ్యవహారాలకు మార్చారు. గిరిరాజ్‌ సింగ్‌ను గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ నుంచి జౌళీ శాఖకు మార్చారు. అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ను న్యాయశాఖ మంత్రిగా కొనసాగించారు. నూతన క్యాబినెట్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎంలకు కీలక శాఖలు దక్కాయి. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ దక్కింది. హర్యానా మాజీ సీఎం ఖట్టర్‌కు విద్యుత్తు, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇచ్చారు.

క్యాబినెట్‌ మంత్రులు

1.రాజ్‌నాథ్‌ సింగ్‌ (బీజేపీ) రక్షణ శాఖ

2.అమిత్‌షా(బీజేపీ) హోం , సహకార శాఖ

3.నితిన్‌ గడ్కరీ(బీజేపీ) రోడ్డు రవాణా, జాతీయ రహదారులు

4.జేపీ నడ్డా(బీజేపీ) ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం; రసాయనాలు, ఎరువులు

5.శివరాజ్‌ చౌహాన్‌(బీజేపీ) వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి

6.నిర్మలా సీతారామన్‌(బీజేపీ) ఆర్థికం, కార్పొరేట్‌ వ్యవహారాలు

7.జైశంకర్‌(బీజేపీ) విదేశాంగ వ్యవహారాలు

8.ఖట్టర్‌(బీజేపీ) గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి; విద్యుత్తు

9. కుమారస్వామి(జేడీఎస్‌) భారీ పరిశ్రమలు, ఉక్కు

10.పీయూశ్‌ గోయల్‌(బీజేపీ) వాణిజ్యం, పరిశ్రమలు

11.ధర్మేంద్ర ప్రధాన్‌(బీజేపీ) విద్యా శాఖ

12.మాంఝీ(హెచ్‌ఎంఎం) సూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు

13.లలన్‌ సింగ్‌(జేడీయూ) పంచాయతీ రాజ్‌,మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ

14.శర్బానంద సోనోవాల్‌(బీజేపీ) పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌ వేస్‌

15.రామ్మోహన్‌ నాయుడు(టీడీపీ) పౌర విమానయానం

16.డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌(బీజేపీ) సామాజిక న్యాయం, సాధికారత

17.జుయెల్‌ ఓరమ్‌(బీజేపీ) గిరిజన వ్యవహారాలు

18.ప్రహ్లాద్‌ జోషి(బీజేపీ) వినియోగదారు వ్యవహారాలు ఆహారం, ప్రజా పంపిణీ; నూతన, పునరుత్పాదక ఇందనం

19.అశ్విని వైష్ణవ్‌(బీజేపీ) రైల్వే శాఖ, సమాచార-ప్రసారాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌

20.గిరిరాజ్‌ సింగ్‌(బీజేపీ) జౌళీ పరిశ్రమ

21.జ్యోతిరాదిత్య కమ్యూనికేషన్స్‌; సింధియా(బీజేపీ) ఈశాన్య రీజియన్‌ అభివృద్ధి

22.భూపేంద్ర యాదవ్‌(బీజేపీ) పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు

23.గజేంద్ర సింగ్‌ షెకావత్‌(బీజేపీ) సాంస్కృతికం, పర్యాటకం

24.అన్నపూర్ణ దేవి(బీజేపీ) మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి

25.కిరణ్‌ రిజిజు(బీజేపీ) పార్లమెంటరీ వ్యవహారాలు,మైనార్టీ వ్యవహారాలు

26.మన్షుఖ్‌ మాండవీయ(బీజేపీ) కార్మిక, ఉపాధి శాఖ; యువజన వ్యవహారాలు, క్రీడలు

27.హర్దీప్‌ సింగ్‌ పురీ(బీజేపీ) పెట్రోలియం, సహజ వాయువు

28. కిషన్‌ రెడ్డి(బీజేపీ) బొగ్గు, గనులు

29.చిరాగ్‌ పాశ్వాన్‌(ఎల్జేపీ) ఆహార శుద్ధి పరిశ్రమలు

30.సీఆర్‌ పాటిల్‌(బీజేపీ) జల్‌శక్తి

సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా)

1.రావ్‌ ఇందర్‌జిత్‌ సింగ్‌(బీజేపీ) గణాంకాలు, కార్యక్రమాల అమలు,ప్లానింగ్‌, సాంస్కృతిక

2.జితేంద్ర సింగ్‌(బీజేపీ) సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ; భౌగోళిక శాస్త్ర; ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్షం

3.అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌(బీజేపీ) న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాలు

4.జాదవ్‌ ప్రతాప్‌ రావ్‌ గణ్‌పత్‌రావ్‌(శివసేన) ఆయుష్‌;ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

5.జయంత్‌ చౌదరి(ఆరెల్డీ) నైపుణ్యాభివృద్ధి, ఆంత్రపెన్యూర్‌షిప్‌; విద్య

సహాయ మంత్రులు

1.జితిన్‌ ప్రసాద(బీజేపీ) వాణిజ్యం, పరిశ్రమలు; ఐటీ, ఎలక్ట్రానిక్స్‌

2.శ్రీపాద యశో నాయక్‌(బీజేపీ) విద్యుత్తు; నూతన, పునరుత్పాదక ఇందనం

3.పంకజ్‌ చౌదరి(బీజేపీ) ఆర్థికం

4.క్రిషన్‌ పాల్‌(బీజేపీ) సహకార శాఖ

5.రామ్‌దాస్‌ అథవాలే(ఆర్పీఐ) సామాజిక న్యాయం, సాధికారత

6.రామ్‌నాథ్‌ ఠాకూర్‌(జేడీయూ) వ్యవసాయం, రైతు సంక్షేమం

7.నిత్యానంద్‌ రాయ్‌(బీజేపీ) హోం శాఖ

8.అనుప్రియా పటేల్‌(అప్నాదల్‌) ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం; రసాయనాలు, ఎరువులు

9.వీ సోమన్న(బీజేపీ) జల్‌శక్తి; రైల్వే

10.పెమ్మసాని చంద్రశేఖర్‌(టీడీపీ) గ్రామీణాభివృద్ధి; కమ్యూనికేషన్స్‌

11.ఎస్పీ సింగ్‌ బఘేల్‌(బీజేపీ) మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ; పంచాయతీ రాజ్‌

12.శోభా కరంద్లాజే(బీజేపీ) సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు; కార్మిక, ఉపాధి

13.కీర్తివర్ధన్‌ సింగ్‌(బీజేపీ) పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులు, విదేశాంగ

14.బీఎల్‌ వర్మ(బీజేపీ) వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ; సామాజిక న్యాయం, సాధికారత

15.శాంతను ఠాకూర్‌(బీజేపీ) పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌

16.సురేశ్‌ గోపి(బీజేపీ) పెట్రోలియం, సహజ వాయువు; పర్యాటకం

17.ఎల్‌ మురుగన్‌(బీజేపీ) సమాచార, ప్రసార శాఖ; పార్లమెంటరీ వ్యవహారాలు

18.అజయ్‌ తమ్టా(బీజేపీ) రోడ్డు రవాణా, జాతీయ రహదారులు

19.బండి సంజయ్‌ కుమార్‌(బీజేపీ) హోం శాఖ

20.కమలేశ్‌ పాశ్వాన్‌(బీజేపీ) గ్రామీణాభివృద్ధి

21.భగీరథ్‌ చౌదరి(బీజేపీ) వ్యవసాయం, రైతు సంక్షేమం

22.సతీశ్‌ చంద్ర దూబే(బీజేపీ) బొగ్గు, గనులు

23.సంజయ్‌ సేథ్‌(బీజేపీ) రక్షణ

24.రవ్‌నీత్‌ సింగ్‌(బీజేపీ) ఆహార శుద్ధి పరిశ్రమలు; రైల్వే

25.దుర్గాదాస్‌ ఉయికే(బీజేపీ) గిరిజన వ్యవహారాలు

26.రక్షా నిఖిల్‌ ఖడ్సే(బీజేపీ) యువజన వ్యవహారాలు, క్రీడలు

27.సుకాంత మజుందార్‌(బీజేపీ) విద్య, ఈశాన్య రీజియన్‌ అభివృద్ధి

28.సావిత్రి ఠాకూర్‌(బీజేపీ) మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి

29.తోఖన్‌ సాహు(బీజేపీ) గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి

30.రాజ్‌ భూషణ్‌ చౌదరి(బీజేపీ) జల్‌శక్తి

31.భూపతిరాజు శ్రీనివాస వర్మ(బీజేపీ) భారీ పరిశ్రమలు; ఉక్కు

32.హరీశ్‌ మల్హోత్రా(బీజేపీ) కార్పొరేట్‌ వ్యవహారాలు; రోడ్డు రవాణా, హైవేలు

33.నిముబెన్‌ జయంతీభాయ్‌ బంభానియా(బీజేపీ) వినియోగదారు వ్యవహారాలు,ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థ

34.మురళీధర్‌ మొహోల్‌(బీజేపీ) సహకారం; పౌర విమానయానం

35.జార్జి కురియన్‌(బీజేపీ) మైనార్టీ వ్యవహారాలు; మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ

36.పబిత్ర మార్గెరీటా(బీజేపీ) విదేశీ వ్యవహారాలు, జౌళీ పరిశ్రమ

Tags

Next Story