Umesh Lalith : సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ ఉమేష్ లలిత్.. నోటిఫికేషన్ జారీ..

Umesh Lalith : భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చింది. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన లేఖను సీజేఐ కేంద్ర న్యాయ శాఖకు పంపగా.. అక్కడి నుంచి దాన్ని ప్రధాని కార్యాలయానికి పంపారు. పీఎం మోడీ ఆమోదం తర్వాత రాష్ట్రపతి పేషీకి వెళ్లింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము 49వ సీజేఐగా ఉదయ్ ఉమేష్ లలిత్ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో 27న ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. జస్టిస్ లలిత్ పదవీ కాలం కేవలం మూడు నెలలు మాత్రమే ఉంది. నవంబర్ 8న ఆయన రిటైర్ కానున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com