Central Government: 'ప్రాథమిక విద్యలో మాతృభాషకే ప్రాధాన్యత ఇవ్వాలి'..

Central Government: ప్రాథమిక విద్యలో మాతృభాషకే ప్రాధాన్యత ఇవ్వాలని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయిదో తరగతి వరకైనా మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని.. వీలైతే ఎనిమిదో తరగతి, ఆపై తరగతుల్లో కూడా కొనసాగించవచ్చని పేర్కొన్న కేంద్రం.. విద్యా హక్కు చట్టం-2009లోనే ఈ విషయం స్పష్టంగా ఉందని తెలిపింది.
మాతృభాష విద్యావిధానంపై లోకసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో అన్ని ప్రాంతీయ భాషలతో పాటు గుర్తించిన 28 భాషల్లో విద్యా బోధన జరుగుతోందని వెల్లడించారు. 2020లో నూతన విద్యా విధానం ప్రకటించే ముందు.. ముసాయిదాపై పార్లమెంటు స్థాయి సంఘం చర్చించి పలు సూచనలు చేసిందని కేంద్ర విద్యా శాఖ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com