Republic Day:ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజు ఎర్రకోట పరేడ్‎లో ముఖ్య అతిథులు ఎవరో తెలుసా

Republic Day:ఈ ఏడాది  రిపబ్లిక్ డే రోజు ఎర్రకోట పరేడ్‎లో  ముఖ్య అతిథులు ఎవరో తెలుసా
1500 మంది రైతు దంపతులకి మోదీ సర్కార్ ప్రత్యేక ఆహ్వానం

రిపబ్లిక్ వేడుకలకు దేశ రాజధాని నగరం ఢిల్లీ అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఇప్పటికే ప్రత్యేక బృందాలు కవాతులు ప్రారంభించాయి. ఇదిలా ఉంటే ఈసారి రిపబ్లిక్ వేడుకలకు ల్లో 1500 మంది రైతులను పరేడ్‎కు ఆహ్వానించాలని భావిస్తోంది బీజేపీ. గతంలో 500 మంది రైతు కుటుంబాలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన కేంద్రం ఇప్పుడు అంతక మూడింతలు ఎక్కువ మందిని ఆహ్వానించేందుకు సంకల్పించింది. దేశవ్యాప్తంగా రైతులు వారి జీవిత భాగస్వామ్యులను పరేడ్ లో పాల్గొనేందుకు ఆహ్వానం పంపించింది. ఇందుకు సంబంధించిన జాబితాను కూడా ఖరాను చేసింది.

ఈ కార్యక్రమానికి దేశంలోని అన్ని ప్రాంతాల వారిని ఎంపిక చేసి ఆహ్వానించామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. వ్యవసాయోత్పత్తుల సంఘాల ప్రతినిధులు, ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి, చిన్న తరహా నీటిపారుదల పథకాల లబ్ధిదారులు వీరిలో ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా వీరికి విందు ఇస్తారని చెప్పారు. రైతు ఉత్పత్తి సంస్థలకు చెందినవారితో పాటు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, మైక్రో ఇరిగేషన్ పథకాల లబ్ధిదారులను ఆహ్వానం అందనున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాన్య రైతు కుటుంబాలకు ఎర్రకోటపై ఎగురవేసే మువ్వన్నెల జెండాను చూసి గౌరవవందనం సమర్పించే అవకాశం కల్పించడంతో ఎంపికైన వారు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 26 రిపబ్లిక్ వేడుకల కోసం ఉత్కంఠగా ఎదురు చేస్తున్నారు.

భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఆహ్వానం అందింది. దేశ రాజధానిలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ నాయకుడు ముఖ్య అతిథిగా రావడం ఇది ఆరోసారి. గతేడాది ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సీసీ హాజరయ్యారు.

ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో రక్షణ దళాలకు చెందిన రెండు మహిళా బృందాలు కవాతు చేయనున్నాయి. "144 మంది సిబ్బందితో కూడిన ఒక బృందంలో మొత్తం మహిళా సైనికులు ఉంటారు, ఇందులో 60 మంది ఆర్మీకాగా మిగిలినవారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీకి చెందిన వారు" అని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

భారత్ ఆగష్టు 15, 1947న బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం పొందింది. రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949న రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26, 1950న అమలులోకి వచ్చింది. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ రోజున జాతీయ జెండాను ఆవిష్కరించారు. అప్పటి నుంచి జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

Tags

Read MoreRead Less
Next Story