India: భారత్‌లో అక్రమంగా ఉంటున్న చైనా పౌరులు.. దాదాపు 726 మంది..

India: భారత్‌లో వీసా నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఉంటున్న విదేశీయులపై భారత ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఎంత మంది విదేశీయులపై చర్యలు తీసుకున్నారో వివరించారు. 2019 నుంచి 2021 మధ్య కాలంలో భారత్‌లో వీసా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఉంటున్న సుమారు 81 మంది చైనా పౌరులకు భారత్‌ని వదిలవెళ్లేలా నోటీసుల, అలాగే మరో 117 మందిని మూడేళ్ల పాటు బహిష్కరించినట్లు వెల్లడించారు.
పైగా సుమారు 726 మంది చైనీయులను వీసా నిబంధనలను ఉల్లంఘంచిన ప్రతికూల జాబితాలో ఉన్నారని చెప్పారు. విదేశాల నుంచి భారత్‌కి వచ్చే వారి రికార్డును ప్రభుత్వం ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుందన్నారు. కొంతమంది విదేశీయులు నిర్లక్ష్యంతోనో లేక చికిత్స నిమిత్తంగానో లేక మరేదైనా వ్యక్తిగత కారణాలతో వీసా గడువు ముగిసిపోయినా ఉండిపోతున్నారని నిత్యానంద రాయ్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com