Fuel And Gas Rates: దేశ ప్రజలకు శుభవార్త.. చమురు, గ్యాస్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన..

X
By - Divya Reddy |21 May 2022 8:15 PM IST
Fuel And Gas Rates: దేశంలో రోజురోజుకూ ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
Fuel And Gas Rates: దేశంలో రోజురోజుకూ ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. చమురు, గ్యాస్‌పై పన్నులు తగ్గించింది. లీటరు పెట్రోల్‌పై 8, డీజిల్‌పై 6 రూపాయల ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో లీటరు పెట్రోల్‌పై 9 రూపాయల 50 పైసలు.. డీజిల్‌పై 7 రూపాయలు తగ్గే అవకాశం ఉంది.
మరోవైపు పీఎం ఉజ్వల్ యోజన పథకం కింద 9 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌పై 200 రూపాయల రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. దీంతో వినియోగదారులకు ఊరట లభించనుంది. ఐరన్, స్టీల్‌పై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గించనున్నట్లు తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com