Monkeypox In India: దేశంలో మంకీఫాక్స్ కేసు.. కేంద్రం హై అలర్ట్..

Monkeypox In India: భారత్‌లో ఓవైపు కరోనా.. మరోవైపు మంకీఫాక్స్ దడ పుట్టిస్తున్నాయి. దేశంలో తొలి మంకీఫాక్స్ కేసు నమోదవడంతో కేంద్రం అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులకు పలు సూచనలు చేసింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులు.. అక్కడ అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలని తెలిపింది. జంతు సంబంధిత ఆహార పదార్థాలను పక్కనబెట్టాలని సూచించింది. మంకీఫాక్స్ లక్షణాలతో ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నా.. వైరస్ లక్షణాలు కన్పించినా వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని కేంద్రం స్పష్టంచేసింది.
గురువారం కేరళలోని కొల్లాంకు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి మంకీఫాక్స్ సోకింది. ఇటీవల యూఏఈ నుంచి కొల్లాంకు వచ్చిన సదరు వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో టెస్టులు చేసిన వైద్యులు అతనికి మంకీఫాక్స్ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. యూఏఈలో ఉన్నప్పడు బాధితుడు.. ఓ మంకీఫాక్స్ రోగితో సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించారు. సదరు వ్యక్తి తల్లిదండ్రులు సహా మొత్తం 13 మందిని ప్రైమరీ కాంటాక్ట్‌గా వైద్యులు గుర్తించారు. బాధితుడి మంకీఫాక్స్ శాంపిళ్లను టెస్టుల కోసం పుణే ల్యాబ్‌కు తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com