Byjus: బైజూస్‌కు మరో షాక్‌

Byjus: బైజూస్‌కు మరో షాక్‌
అకౌంట్‌ బుక్స్‌పై ఫోకస్‌ పెట్టిన కేంద్రం

బైజూస్‌(Byju's) కష్టాలు పెరుగుతున్నాయి. టాప్ కంపెనీల్లో ఒకటిగా వెలుగొందిన ఇది ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. బైజూస్ (Byju's)అకౌంట్‌ బుక్స్‌ను క్షుణ్నంగా పరిశీలించాలని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆర్డర్‌ పాస్‌ చేసినట్లు సమాచారం. ఖాతా పుస్తకాలను తనిఖీ చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ విషయం పై ఆరు వారాల్లో నివేదికను ఇవ్వాలని కోరింది.

ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్‌ (Byju's)ను కష్టాలు వదిలెట్టు కనిపించడం లేదు. సంస్థకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్స్ రిజైన్ చేయగా, ఆడిటింగ్ బాధ్యతల నుంచి డెలాయిట్ సైతం తప్పుకుంది. ఉద్యోగుల పీఫ్ కూడా సమయానికి జమ చేయలేని ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నివేదికలోని విషయాల ఆధారంగా తదుపరి విచారణను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌కు అప్పగించాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయిస్తారని తెలుస్తోంది.

నిజానికి బైజూస్ ఆర్థిక పరిస్థితి బయటకు తెలియడం లేదు. బైజూస్ 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన ఆర్థిక నివేదికలను ఇంకా సమర్పించలేదు. ఆడిటర్ కూడా రాజీనామా చేశారు. జాతీయ ఫండ్‌‌కు బకాయిలు చెల్లించలేకపోవడంతో కంపెనీకి ఇబ్బందులు పెరుగుతున్నాయి. బైజూస్ విదేశీ మారకపు చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణలూ ఉన్నాయి. దీంతో అమెరికాలో కూడా కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అదే సమయంలో బైజూస్ కంపెనీ వాల్యూ దారుణంగా పడిపోతోంది.

ఇండియాలో అతి తక్కువ సమయంలో ఎంతగానో ఆదరణ పొందిన, అభవృద్ధి చెందిన స్టార్టప్స్ లో బైజూస్ ఒకటి. 2011లో స్థాపించబడిన బైజూస్ సంస్థ 2018 నాటికి కొవిడ్ సమయంలో బిలియన్ డాలర్ల కంటే విలువైన సంస్థ(యూనికార్న్)గా అవతరించింది. ఊహించిన దాని కంటే ఎంతో గొప్పగా విస్తరించింది. కానీ రెండేళ్లలో సీన్ రివర్స్ అయిపొయింది. 2021లో రూ.2.7 లక్షల కోట్లు నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం సంస్థ విలువ 5.1 బిలియన్ డాలర్లకు పడిపోయింది.ఓ వైపు అప్పులు ఇచ్చిన అమెరికా కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి.మరోవైపు ఆడిటింగ్ కంపెనీలు డెలాయిట్ హస్కిన్స్, సెల్స్ లిప్స్ సంస్థలు తప్పుకున్నాయి. ఆ తర్వాత ఈ కంపెనీలో ముగ్గురు బోర్డు మెంబర్లు రాజీనామా చేశారు. దాంతో ప్రస్తుతం బోర్డులో బైజు రవీంద్రన్, అతని భార్య, సోదరుడు మాత్రమే మిగిలారు. ఇన్ని సమస్యల నడుమ కేంద్రం ప్రభుత్వం బైజూస్ వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఇప్పటికే అప్పులు ఇచ్చిన సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బైజూస్ కంపెనీకి ఇది కొత్త తలనొప్పనే చెప్పచ్చు . భారతదేశంలో కొత్తగా రూపదాల్చనున్న స్టార్టప్స్ కు బైజూస్ (Byju's)కథ ఒక ఉదాహరణ అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. .

Tags

Read MoreRead Less
Next Story