రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 2023-24 సంవత్సరానికి గాను ఖరీఫ్‌ సీజన్‌లో పండిన పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 2023-24 సంవత్సరానికి గాను ఖరీఫ్‌ సీజన్‌లో పండిన పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వరి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు ఏడు శాతం, పెసర్లపై ఎంఎస్‌పీని 10 శాతానికి పెంచారు. కందులపై కనీస మద్దతుధర 7 శాతం పెంచగా.. జొన్న ఇతర పంటలపై కూడా కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సాధారణ వరి క్వింటాకు 143 రూపాయల మేర పెంచిన మోదీ సర్కారు.. 2 వేల 183 రూపాయలుగా నిర్ణయించింది.

ఏ గ్రేడ్ ధాన్యానికి కనీస మద్దతు ధరకు 163 రూపాయల మేర పెంచగా.. 2 వేల 203 రూపాయలుగా ఖరారు చేసింది. పెసలు కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచిన కేంద్రం 8 వేల 558 రూపాయలుగా నిర్ణయించింది. పంటల కనీస మద్దతు ధరల పెంపు అన్నదాతలకు లాభదాయకంగా మారుతుందని.. ఆర్థికంగా చేయూతనిస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రైతులకు కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని తెలిపారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఖరీఫ్‌ సీజన్లో పంటలకు కనీస మద్దతు ధరను భారీగా పెంచినట్టు పీయూష్ గోయల్ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story