GST: రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఒక్క నెలలోనే రూ.లక్షా 49 వేల కోట్లు..
![GST: రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఒక్క నెలలోనే రూ.లక్షా 49 వేల కోట్లు.. GST: రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఒక్క నెలలోనే రూ.లక్షా 49 వేల కోట్లు..](https://www.tv5news.in/h-upload/2022/08/01/764566-gst.webp)
By - Divya Reddy |1 Aug 2022 12:30 PM GMT
GST: జీఎస్టీ వసూళ్లు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. జులై నెలలో లక్షా 49 వేల కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైంది.
GST: జీఎస్టీ వసూళ్లు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. జులై నెలలో లక్షా 49 వేల కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైంది. జీఎస్టీని తీసుకొచ్చినప్పటి నుంచి ఈ స్థాయి కలెక్షన్స్ రావడం ఇది రెండోసారి. గతేడాది ఇదే నెలతో పోల్చితే జీఎస్టీ వసూళ్లలో 28 శాతం వృద్ధి కనిపించింది. మొన్నటి జూన్‌లోనూ లక్షా 44వేల కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైంది. వరుస ఐదు నెలలుగా.. నెలకు లక్షా 40వేల కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా జీఎస్టీ వసూళ్లవతున్నాయి. జులై నెలలో సెంట్రల్ జీఎస్టీ కింద 25వేల 750 కోట్లు, స్టేట్ జీఎస్టీ కింద 32వేల 807 కోట్లు, ఐజీఎస్టీ కింద 79వేల 518 కోట్లు వసూళ్లయ్యాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com