Rajya Sabha: 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల..

Rajya Sabha: 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల..
X
Rajya Sabha: జూన్‌ నెలలో ఖాళీ కాబోతున్న 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

Rajya Sabha: జూన్‌ నెలలో ఖాళీ కాబోతున్న 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు, ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది.. మే 24న నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. నామినేషన్లకు చివరి తేదీ మే 31.. ఇక జూన్‌ ఒకటిన నామినేషన్ల పరిశీలన ఉంటుంది.. జూన్‌ పదిన పోలింగ్‌ జరుగుతుంది.. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.. ఏపీ నుంచి విజయసాయిరెడ్డి, సురేష్‌ ప్రభు, టీజీ వెంకటేష్‌, సుజనా చౌదరి పదవీ కాలం ముగియనుంది.. ఇక తెలంగాణ నుంచి లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ పదవీ కాలం ముగియనుంది.

Tags

Next Story