రైల్వే ఉద్యోగులకు కేంద్రం దీపావళి గిప్ట్.. 78 రోజుల బోనస్

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల దీపావళి బోనస్‌ను కేబినెట్ సమావేశంలో కేంద్రం ఆమోదించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆమోదం పొందితే దాదాపు 12 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. గ్రూప్ సి, గ్రూప్ డి, గ్రూప్ బిలోని కొన్ని వర్గాలకు చెందిన ఉద్యోగులకు దీపావళి బోనస్‌ను కేంద్రం పునరుద్ధరించిన ఒక రోజు తర్వాత ఈ అప్ డేట్ వచ్చింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగం ఈ సంవత్సరం కొంత మంది ఉద్యోగులకు బోనస్ లభిస్తుందని, అది కూడా కొన్ని సర్వీస్ షరతులకు లోబడి ఉంటుందని పేర్కొంది. కేంద్ర పారామిలిటరీ, సాయుధ బలగాలకు చెందిన అర్హులైన ఉద్యోగులకు బోనస్ వర్తిస్తుంది.
"ఈ ఆర్డర్‌ల కింద తాత్కాలిక బోనస్ చెల్లింపు కోసం గరిష్టంగా నెలవారీ చెల్లింపులు రూ. 7,000గా ఉంటాయి" అని పేర్కొంది. కేంద్రం ఆదేశాల ప్రకారం, మార్చి 31, 2021 నాటికి సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు మరియు 2020-21 ఆర్థిక సంవత్సరంలో కనీసం ఆరు నెలల పాటు నిరంతర సర్వీసును అందించిన ఉద్యోగులు ఈ బోనస్‌కు అర్హులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com