SIM Card Rule: సిమ్‌కార్డు డీలర్స్‌కు పోలీస్ వెరిఫికేషన్

సైబర్ నేరాలు(cyber fraud ), మోసపూరిత ఫోన్ కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్ కార్డులు(SIM Card Rule) విక్రయించే డీలర్లకు పోలీసు వెరిఫికేషన్ అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్(Centre makes police verification) తప్పనిసరి చేసింది. ఎక్కువ మొత్తంలో సిమ్ కార్డు కనెక్షన్లు ఇవ్వడంపైనా( bulk connections discontinued) ఆంక్షలు విధించింది. సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్లు టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్( Telecom Minister Ashwani Vaishnaw) వెల్లడించారు. ఇక నుంచి సిమ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆ తర్వాత వారు తమ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని వైష్ణవ్ చెప్పారు.ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి 10లక్షల జరిమానా విధిస్తామని వెల్లడించారు.
బల్క్ కనెక్షన్ల నిబంధనను తొలగించి, బిజినెస్ కనెక్షన్ల పేరుతో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంతో కంపెనీలు కాకుండా ఉద్యోగులు KYCని పూర్తి చేసిన తర్వాతే వారికి సిమ్ కార్డులను ఇవ్వాల్సి ఉంటుందని టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో నకిలీ సిమ్‌కార్డుల అమ్మకానికి, ఒకే వ్యక్తిపై ఎక్కువ సిమ్‌ల విక్రయాలకు అడ్డుకట్టపడడంతో పాటు సిమ్ స్పామింగ్‌ను సైతం తగ్గిస్తుందన్నారు. ఇప్పటి వరకు 52లక్షల మొబైల్ కనెక్షన్లు మూసివేయగా.. 67వేల మంది డీలర్లను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు కేంద్రం తెలిపింది. ఈ ఏడాది మే నుంచి సిమ్‌కార్డు డీలర్లపై దాదాపు 300 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. నకిలీ సిమ్‌కార్డుల రాకెట్‌లో పాల్గొన్న 66వేల వాట్సాప్ అకౌంట్లను సైతం బ్లాక్ అయ్యాయి. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలీస్ వెరిఫికేషన్ లేకుండా సిమ్‌కార్డులను విక్రయిస్తే రూ.10లక్షల వరకు జరిమానా విధించనున్నారు. గతంలో ప్రజలు సిమ్ కార్డులను విరివిగా కొనుగోలు చేశారని, ఆ విధానానికి స్వస్తి పలకాలని కేంద్ర మంత్రి సూచించారు.
ప్రస్తుతం దేశంలో దాదాపు 10లక్షల మంది వరకు సిమ్‌కార్డు డీలర్లు ఉండగా వీరంతా తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉండనున్నది. అలాగే షాప్ కోసం కేవైసీని సైతం చేయాల్సి ఉంటుంది. లికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ కూడా బల్క్ కనెక్షన్ల సదుపాయాన్ని నిలిపివేసిందని, బదులుగా బిజినెస్ కనెక్షన్ అనే కొత్త కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
మరోవైపు గత నాలుగు నెలల్లో తమిళనాడులోని సైబర్ క్రైమ్ వింగ్ రాష్ట్రవ్యాప్తంగా 25,135 సిమ్ కార్డులను మోసపూరిత కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లుగా అనుమానిస్తూ వాటిని బ్లాక్ చేసింది. ఇక ఏపీలోని విజయవాడలో ఒకే ఫొటోతో 658 సిమ్‌కార్డులు జారీ చేసినట్లు ఏఐ టెక్నాలజీతో విషయం వెలుగు చూసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com