EY Pune employee death : కేరళకు చెందిన యువ సిఏ ప్రాణం తీసిన పని ఒత్తిడి
అకౌంటింగ్ కంపెనీ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై)లో సీఏగా పనిచేస్తున్న అన్నా సెబాస్టియన్ పెరయిల్ (26) అనే యువతి అనారోగ్య కారణాలతో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరయిల్ పుణెలోని ఈవై కంపెనీలో నాలుగు నెలల క్రితమే ఉద్యోగంలో చేరింది.
‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీలో పనిచేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ (26) అన్నా సెబాస్టియన్ పెరియాలి మృతి సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమె మృతిపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాల్ని తేల్చేందుకు విచారణ చేపట్టబోతున్నామని కేంద్ర కార్మిక శాఖ గురువారం ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. సెబాస్టియన్ తల్లి అనిత చేసిన ఫిర్యాదును స్వీకరిస్తున్నట్టు కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే ‘ఎక్స్’లో వెల్లడించారు.
దేశంలో ఎంతోమంది యువతీ యువకులు కలలుగంటున్న ‘సీఏ’ను సెబాస్టియన్ డిస్టింక్షన్‌లో పాసయ్యారు. పుణేలోని ‘ఈవై గ్లోబల్’ కంపెనీలో ఈ ఏడాది మార్చి 18న చేరారు. ఛాతిలో నొప్పితో జూలై 20న హఠాత్తుగా ఆమె చనిపోయారు. ఆమె మరణం.. తల్లిదండ్రుల్ని షాక్‌కు గురిచేసింది. కంపెనీలో నాలుగు నెలలు రాత్రిపగలు తన కూతురుపై పని భారం మోపారని, సరిగా నిద్ర పోనివ్వకుండా అధిక పని ఒత్తిడి వల్లే ఆమె మరణించిందని తల్లి అనిత ఆరోపిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com