Anand Sharma: హస్తం పార్టీకి మరో షాక్.. మరో సీనియర్ నేత రాజీనామా..

Anand Sharma: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న వేళ సీనియర్ నేతలు ఝలక్ ఇస్తున్నారు. సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ హిమాచల్ ప్రదేశ్‌లో ఊహించని షాక్ ఇచ్చారు. తాను హిమాచల్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు స్పష్టం చేశాడు. ఈ మేరకు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశాడు. తాను ఆత్మగౌరవంతోనే రిజైన్ చేస్తున్నట్టు వెల్లడించాడు. అయితే హిమాచల్‌లో అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తానని చెప్పినట్టు సమాచారం.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఆనంద్ శర్మ నిర్ణయం పార్టీని కుదిపేసింది. పార్టీ సమావేశాలకు ఆహ్వానించకపోవడం, ముఖ్యమైన విషయాల్లో తనను సంప్రదించకపోవడం వంటి విషయాల్లో ఆనంద్ శర్మ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. అటు మరో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ను జమ్మూ కశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే పార్టీ నిర్ణయాన్ని ఆజాద్ నిరాకరించారు. అంతేగాక పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com