Chandrayaan 3: చంద్రుడిపై జరిగే పరిశోధనలు ఇవే!

Chandrayaan 3: చంద్రుడిపై జరిగే పరిశోధనలు ఇవే!
సూర్యకాంతి ఆగిపోయాక మైనస్‌ 180 డిగ్రీలు

చంద్రుడిపై దిగిన ల్యాండర్‌, రోవర్‌లు ఏం చేస్తాయి?
వాటికి శక్తి ఎలా అందుతుంది?
జాబిల్లిపై సురక్షితంగా దిగిన తర్వాత ల్యాండర్‌, రోవర్‌లు ఏం చేస్తాయి.?
ఎన్ని రోజులు పరిశోధనలు జరుపుతాయి ?
వీటికి అవసరమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ?

ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న డౌట్లు.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చేరుకున్న తర్వాత ముందుగా ల్యాండర్‌ విక్రమ్‌ లోపలి నుంచి బయటకు వచ్చిన ప్రగ్యాన్‌ రోవర్‌ వాటికి ఉన్న ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపైకి చేరుకుని 14 రోజుల పాటు వాటిలో ఉన్న 5 కీలకమైన పేలోడ్‌ల ఆధారంగా పరిశోధన చేస్తాయి.

చంద్రుడిపై వాతావరణం ఎలా ఉంది..చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టి, రాళ్లో ఎలాంటి రసాయనాలు, మూలకాలు ఉన్నాయి వంటి విషయాలను పేలోడ్‌లు పరిశోధించి ఆ సమాచారాన్ని భూమిమీదకు చేరవేస్తాయి. ఇందులో ల్యాండర్‌ చేసే పరిశోధనలు నేరుగా భూమిపైకి కమ్యూనికేట్‌ అవుతాయి. రోవర్‌ మాత్రం ల్యాండర్‌కు కమ్యూనికేట్‌ చేస్తుంది.


చంద్రయాన్‌-3లో అత్యంత ముఖ్యమైనది ల్యాండర్‌ విక్రమ్‌ భారత అంతరిక్ష పరిశోధన పితామహుడిగా పిలుచుకునే డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ పేరును దీనికి పెట్టారు.విక్రమ్‌ రెండు మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రజ్ఞాన్‌తో కలిపి విక్రమ్‌ బరువు 1 వేయి 749 కిలోలు.ప్రత్యేక కెమెరా, ప్రాసెసింగ్‌ అల్గారిథమ్‌, లేజర్‌-ఆర్‌ఎఫ్‌ ఆధారిత ఆల్టీమీటర్లు, లేజర్‌ డాప్లర్‌ వెలోసిమీటర్‌, క్షితిజ సమాంతర వెలాసిటీ కెమెరా, ప్రమాదాల గుర్తింపు,నివారణ లాంటి అధునాతన సాంకేతికతలు విక్రమ్‌లో ఉన్నాయి, ఇక విక్రమ్‌ ల్యాండర్‌లో మొత్తం మూడు పేలోడ్‌లు రాంబా,చాస్టే,ఐఎల్‌ఎస్‌ఏ ఉంటాయి.ఇందులో రాంబా చంద్రుడి ఉపరితలంపై ఉన్న అయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రతపై అధ్యయనం చేస్తుంది.చాస్టే పేలోడ్‌ చంద్రుడిపైన ఉష్ణ లక్షణాలను కొలుస్తుంది. ఐఎల్‌ఎస్‌ఏ మాత్రం చంద్రుడిపై పొరలు, మట్టి స్వభావాన్ని పరిశీలిస్తుంది.

ఇక ప్రగ్యాన్‌ రోవర్‌లో రెండు పేలోడ్‌ లిబ్స్‌, APXSలు ఉంటాయి. ఇందులో లిబ్స్‌ లో ఉన్న లేజర్‌ చంద్రుడిపై ఉన్న మట్టిపై పడుతుంది. ఆ లేజర్‌ లైట్‌ ద్వారానే చంద్రుడిపైన ఉన్న మట్టి కరుగుతుంది. అలా కరిగిన మట్టిలో ఎలాంటి రసాయన మూలకాలు, ఖనిజ సంపద ఉందో లిబ్స్‌ గుర్తిస్తుంది. రోవర్‌ దిగిన ప్రదేశంలోని మట్టి రాళ్లలో ఉన్న రసాయనాలను APXS పేలోడ్‌ గుర్తిస్తుంది. చంద్రుడిపై ఉన్న మట్టి, రాళ్లలో మెగ్నీషియం, సిలికాన్‌, పొటాషియం, కాల్షియం, టైటానియం,అల్యూమినియం వంటి మూలకాలను గుర్తిస్తుంది.


అయితే విక్రమ్‌, ప్రగ్యాన్‌ల జీవితకాలం 14 రోజులు మాత్రమే.చంద్రుడిపై ఒక్క పగలు మనకు 14 రోజులతో సమానం. చంద్రుడిపై సూర్యరశ్మి ఉన్నంతసేపే విక్రమ్‌, ప్రగ్యాన్‌లు సక్రమంగా పనిచేస్తాయి.ఈ రెండింటిపైన ఉన్న సోలార్‌ ప్యానెల్‌లతోనే వీటికి శక్తి అందుతుంది. చంద్రుడిపై సూర్యాస్తమయం అయితే మైనస్‌ 180 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కాబట్టి ల్యాండర్‌, రోవర్‌లకు శక్తి అందదు. అలాంటి పరిస్థితుల్లో వాటిలోని వ్వవస్థలు సక్రమంగా పనిచేయవు.

Tags

Read MoreRead Less
Next Story