Chandrayaan-3: ఇక చంద్రుడిపై కాలుమోపడమే మిగిలింది.....

Chandrayaan-3: ఇక చంద్రుడిపై కాలుమోపడమే మిగిలింది.....
చంద్రయాన్‌-3లో మరో కీలక ఘట్టం పూర్తి... జాబిల్లి కక్ష్యలోకి వాహకనౌక ప్రవేశం... అనుకున్న లక్ష్యం దిశగా సాగుతున్న మిషన్‌...

చంద్రయాన్‌-3(Chandrayaan-3) ప్రయాణంలో మరో కీలక ఘట్టం పూర్తయింది. చంద్రుడిపై కాలుమోపడమే లక్ష్యంగా రోదసిలో పయనిస్తున్న భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 అనుకున్న లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి ఈ వ్యోమనౌక మరింత చేరువైంది(Mission Now Closer To Moon).

బెంగళూరులోని ఇస్ట్రాక్‌ ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుంచి వ్యోమనౌకను జాబిల్లి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు(successfully inserted) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రకటించింది. ఇప్పుడు అది.. అక్కడి దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. మాక్స్‌ ఇస్ట్రాక్‌.. నేను చంద్రయాన్‌-3ని. జాబిల్లి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం నాపై కనపడుతోందని(Feeling Lunar Gravity) చంద్రయాన్‌-3 సందేశం పంపినట్లు ఇస్రో పేర్కొంది.


చంద్రయాన్‌-3ని గత నెల 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా ఇస్రో భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అది భూమి చుట్టూ దశలవారీగా కక్ష్యను పెంచుకొని, ఈ నెల 1న చంద్రుడిని చేరే లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి ప్రవేశించింది. ఈ మార్గంలో ప్రయాణిస్తూ శనివారం రాత్రి 7 గంటల సమయంలో చందమామకు అత్యంత దగ్గరగా ఉండే బిందువులోకి ప్రవేశించింది.


లూనర్ ఆర్బిట్ ఇనసర్షన్ పక్రియను విజయవంతంగా చేపట్టామని , చంద్రయాన్‌-3 మొదటిదశ కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆగస్టు 6 వ తేదీ 11గంటలకు నిర్వహించనున్నారు. ఈ విధంగా దశల వారీగా కక్ష్యను తగ్గిస్తూ చంద్రుడి చుట్టూ ఆరుసార్లు ఈ నెల 17 వరకు తిరిగిన అనంతరం వ్యోమనౌకను చంద్రుడికి చేరువ చేస్తారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ జాబిల్లికి 100 కిలోమీటర్ల ఎత్తులోకి చేర్చనున్నారు. ఇదంతా సజావుగా సాగితే ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెట్టనుంది. చంద్రయాన్‌-3 వేగాన్ని నిర్దిష్టంగా తగ్గించడం అత్యంత కీలకమని ఇస్రో ప్రకటించింది. . లేకుంటే అది చంద్రుడిని దాటి వెళ్లిపోవడమో లేక జాబిల్లి ఉపరితలాన్ని వేగంగా ఢీకొట్టడమో జరుగుతుందని వివరించింది.

జూలై 14న చంద్రునిపైకి చంద్రయాన్-3 మిషన్ ప్రారంభించిన తర్వాత అంతరిక్ష నౌక కక్ష్య క్రమంగా ఐదు రెట్లు పెరిగింది. అయితే ఆ కక్ష్యను ఆగస్టు 6న తగ్గిస్తామని ఇస్రో వెల్లడించింది. కాగా 2023 జూలై 14న LVM-3లో చంద్రయాన్- 3 ప్రయోగించింది ఇస్రో.Chandrayaan-3Chandrayaan-3 Feeling Lunar Gravity": India's Mission Now Closer To Moon

Tags

Read MoreRead Less
Next Story