Chandrayan 3: స్పీడ్ పెరిగింది

Chandrayan 3: స్పీడ్ పెరిగింది
నేడు మరోసారి కక్ష్య తగ్గింపు.. జాబిలికి మరింత దగ్గరగా

జాబిల్లిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -3 లక్ష్యానికి మరింత చేరువైంది. చంద్రయాన్ -3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ నుంచి ఈ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించింది.


ప్రస్తుతం జాబిల్లి చుట్టూ 150 కిలోమీటర్లు బై 177 కిలోమీటర్ల కక్ష్యలో చంద్రయాన్ -3 పరిభ్రమిస్తోంది. చంద్రుడి చుట్టు చక్కర్లు కొట్టే విషయంలో చంద్రయాన్ -3కి ఇది రెండో చివరి కక్ష్య. ఈ నెల 5వ తేదీన చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్ -3 ప్రవేశించింది. ఆ తర్వాత 6, 9 తేదీల్లో కక్ష్య తగ్గింపు విన్యాసాలను ఇస్రో చేపట్టింది. ఈ నెల 16వ తేదీ ఉదయం 8 గంటల 30 నిమిషాలకు మరోసారి కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది. ఆ రోజు చంద్రునికి 100 కిలోమీటర్ల దూరంలోకి కక్ష్యలోకి చంద్రయాన్ -3 చేరనుంది. ఆ తర్వాత రోవర్ , ల్యాండర్ తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ ... ప్రొపల్షన్ మాడ్యూల్ తో విడిపోనుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23వ తేదీ సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ అడుగుపెట్టనుంది. అందులోంచి రోవర్ బయటకు వచ్చి 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది.

చంద్రయాన్ 3 లోని ల్యాండర్ హారిజాంటల్ వెలాసిటీ కెమెరా తీసిన చందమామ ఫొటో లు వైరల్ అవుతున్నాయి. చంద్రయాన్ 3 చంద్రుడి కక్ష్యలోకి చేరిన ఆగస్ట్ 6 వ తేదీ మర్నాడు తీసిన ఈ ఫోటో ఇది.



మరోవైపు సుమారు 47 ఏళ్ల తర్వాత చంద్రుడి పైకి రష్యా మళ్లీ రాకెట్‌ ప్రయోగం చేపట్టింది. దక్షిణ ధ్రువమే లక్ష్యంగా ‘లునా – 25’ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను శుక్రవారం ఉదయం విజయవంతంగా ప్రయోగించింది. రష్యా కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.00 గంటలకు వాస్టోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి ‘లునా-25’ రాకెట్‌ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఐదు రోజుల్లో ఇది చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. అనంతరం, జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగేందుకు అనువైన ప్రదేశం కోసం 3 లేదా 7 రోజులు అన్వేషించిన అనంతరం చంద్రుడిపై దిగుతుంది

Tags

Read MoreRead Less
Next Story