Chandrayaan-3: జాబిల్లిపై ల్యాండర్ నిద్ర..

Chandrayaan-3: జాబిల్లిపై ల్యాండర్   నిద్ర..
ఎదురుచూడటం తప్ప ఇంకేం చేయలేమన్న ఇస్రో ఛైర్మన్

నిన్న మొన్నటివరకు చంద్రయాన్-3 మిషన్ ల్యాండర్ జాబిల్లిపై తన పనిని సమర్థవంతంగా పూర్తిచేసి ఇప్పుడు హాయిగా నిద్రపోతోందన్నారు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ . తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ అందడం లేదని తెలిపారు. అయినప్పటికీ తమ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని సోమనాథ్ చెప్పారు. జాబిల్లిపై ల్యాండర్, రోవర్ 14 రోజుల పాటే పనిచేసేలా వాటిని ఇస్రో అభివృద్ధి చేసింది. కాబట్టి

జాబిల్లిపై దిగిన తర్వాత అవి అక్కడ పూర్తి స్థాయిలో పనిచేసినట్టే అన్నారు. ఇక సెప్టెంబరు 2న ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 వ్యోమనౌక చాలా సమర్థంగా పనిచేస్తోందని, లెగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యలోకి వెళ్లే దిశలో ప్రయాణం కొనసాగుతోందని చెప్పారు. చంద్రయాన్ 3 ప్రయోగం భారతదేశం ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసింది. ఇప్పటి వరకు ఏ దేశానికి సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధృవంపై తొలి సారిగా సేఫ్ ల్యాండింగ్ చేసి, దక్షిణ ధృవంపై కాలు మోపిన తొలి దేశంగా చరిత్ర స‌ృష్టించింది. అగ్రదేశాలు సైతం ఆశ్చర్య పోయేలా ప్రయోగాన్ని విజయవంతం చేసింది. అతి తక్కువ ఖర్చుతో ప్రపంచంలో ఏ ఇతర దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రయాన్‌ 3ని విజయంతం చేసి అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేసింది. అంతేకాదు భారత టెక్నాలజీని మరో లెవల్‌కు వెళ్లింది. భారత్ చంద్రయాన్ 3ని విజయంతంగా ప్రయోగించడంతో భారత టెక్నాలజీపై అందరికి ఆసక్తి ఏర్పడింది. ఆ సాంకేతికత ఏంటో తెలుసుకోవడానికి అమెరికా సైతం ఆసక్తి చూపింది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ స్వయంగా వెల్లడించారు.


భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 గురించి తెలుసుకోవాడానికి నాసా నుంచి ఆరుగురు నిపుణులు వచ్చారని, వారికి చంద్రయాన్ 3 ప్రయోగం గురించి పూర్తిగా వివరించినట్లు చెప్పారు. ఇస్రో తయారు చేసిన సాంకేతిక పరికరాలను పరిశీలించిన నాసా నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారని, అవి చాలా తక్కువ ఖర్చుతో, నిర్మాణానికి సులభంగా, అత్యాధునిక సాంకేతికతతో ఉన్నాయని కితాబిచ్చినట్లు తెలిపారు. చవకైన, ఆధునిక సాంకేతిక పరికరాల తయారీ విధానం, ఉపయోగించిన సాంకేతికత పంచుకోవాలని నాసా అధికారులు కోరినట్లు సోమనాథ్ చెప్పారు.

మరోవైపు ఆగస్టు 23న విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగినందుకు గుర్తుగా ఆ రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పాటించాలని నిర్ణయించారు.

Tags

Next Story