Chandrayan-3 : సేఫ్ లాండింగ్ కోసం పూజలు

Chandrayan-3 : సేఫ్ లాండింగ్ కోసం పూజలు
శాస్త్రవేత్తలపై అభిమానం, చంద్రయాన్ -3 పై ప్రేమ చూపిస్తున్న ప్రజలు

చంద్రయాన్ -3, ఇప్పుడు అందరి ఆశలూ దానిపైనే..మిషన్ సాఫ్ట్ ల్యాండింగయ్యే ఉద్విగ్న క్షణాల కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే సక్సెస్ కోసం అందరూ కోరుకుంటున్నా, కొంతమంది మాత్రం ఆ ప్రయోగం విజయవంతం కావాలని పూజలు, యాగాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కామాఖ్య దేవాలయంలో చంద్రయాన్ - 3 ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ స్థానికులు పూజలు నిర్వహించారు. మాడ్యూల్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుని దక్షిణ ధ్రువం ఉపరితలంపై అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తూ చంద్రయాన్ -3 నమూనాలతో యాగం నిర్వహించారు.


ఇక తమిళనాడు కొయంబత్తూర్ కు చెందిన మరియప్పన్ అనే కళాకారుడు నాలుగు గ్రాముల బంగారంతో చంద్రయాన్ - 3 మిషన్ నమూనాను తయారు చేశాడు. 48గంటలు శ్రమించి ఒకటిన్నర అంగుళాల పొడవుతో చంద్రయాన్ -3 ల్యాండర్ నమూనాను రూపొందించినట్లు చెప్పాడు. చంద్రయాన్ -3 మిషన్ మాడ్యూల్ ల్యాండర్ రేపు చంద్రుని దక్షిణధ్రువం ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుందనే అందరూ కోరుకుంటున్న నేపథ్యంలో అంతరిక్షరంగంలో భారత ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసే చంద్రయాన్ -3 మిషన్ కోసం శ్రమించిన శాస్త్రవేత్తలపై అభిమానాన్ని చాటుతూ ఈ నమూనాను రూపొందించినట్లు మరియప్పన్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story