Chandrayaan-3: ఇక మిగిలింది చరిత్ర సృష్టించడమే

Chandrayaan-3: ఇక మిగిలింది చరిత్ర సృష్టించడమే
చంద్రయాన్‌-3 చివరి డీ-బూస్టింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన ఇస్రో... అంతా సవ్యంగా ఉందని ప్రకటన...

జాబిల్లిపైన రహస్యాలు ఛేదించేందుకు చంద్రయాన్‌-3(Chandrayaan-3) దూసుకెళ్తోంది. ఈ ప్రతిష్టాత్మక మిషన్‌లో మరో కీలక ఘట్టాన్ని ఇస్రో( Indian Space Research Organisation ) విజయవంతంగా పూర్తి చేసింది. చివరి డీ-బూస్టింగ్‌ ప్రక్రియ(deboosting operation )ను విజయవంతంగా పూర్తిచేసినట్లు( successfully completed) ఇస్రో ప్రకటించింది. ఈ ప్రక్రియ విజయవంతంతో చంద్రుడి అతిదగ్గరి కక్ష్యలో(spacecraft inches closer to the Moon )కి విక్రమ్‌ మాడ్యూల్‌ చేరింది. చంద్రుడి నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ ప్రస్తుతం అత్యల్పంగా 25కి.మీ, అత్యధికంగా 134 కి.మీ దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. పెరిలూన్‌ కక్ష్యలోకి ల్యాండర్‌ ప్రవేశించిందని... ఈ కక్ష్య నుంచే ఈ నెల 23న సాఫ్ట్‌ ల్యాండింగ్‌ (soft-landing )నిర్వహించనున్నామని ఇస్రో ప్రకటించింది.

చంద్రయాన్‌-3‍(historic mission Chandrayaan-3 )చివరి డీ బూస్టింగ్‌ ప్రక్రియ పూర్తికావడంతో ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగడమే ఇక మిగిలి ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం కీలక, చివరిదశ అయిన విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌పై దృష్టి పెట్టారు. అన్నీ అనుకూలిస్తే ఇస్రో ఆగస్టు 23న చంద్రుడి దక్షిణధ్రువంపై చంద్రయాన్‌-3 దిగనుంది. ఎంచుకున్న ల్యాండింగ్‌ సైట్‌లో సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నామని, చంద్రుడిపై అడుగుపెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రారంభమవుతుందని ఇస్రో ట్వీట్‌ చేసింది.

జులై 14న శ్రీహరి కోట నుంచి బయలుదేరిన చంద్రయాన్ 3... 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్ట్ 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే ప్రయత్నంలో ఉంది.అయితే, ఆగస్ట్ 11న రష్యా ప్రయోగించిన లూనా 25 కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే లూనా 25 లోని కెమెరాలు తీసిన ఫోటోలను రష్యన్ స్పేస్ ఏజెన్సీ విడుదల చేసింది.అన్నీ సవ్యంగా సాగితే ఆగస్ట్ 21నే చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు సన్నాహాలు చేస్తోంది రష్యా. అయితే ఈ ప్రయత్నంలో ఎవరు ముందుంటారు అన్నది వేచి చూడాల్సిందే.

చంద్రునిపై అధ్యయనానికి భారత్‌-రష్యా వేర్వేరుగా ప్రయోగించిన అంతరిక్ష నౌకలు ఒకే లక్ష్యంగా సాగుతున్నాయి. అయితే భారత్‌ కంటే ముందే చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసి చరిత్ర సృష్టించాలని రష్యా ఉత్సాహ పడుతోంది. మన కంటే ఆలస్యంగా ప్రయోగించినా ముందే చేరాలన్నది రష్యా లక్ష్యం. అయితే రష్యా ల్యాండర్‌ అనుకున్న సమయాని కంటే ఆలస్యంగా సాఫ్ట్ ల్యాండ్‌ అయ్యే అవకాశం ఉందని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది.

భారత్‌ చంద్రయాన్‌-3ను ప్రయోగించిన తర్వాత రష్యా,చంద్రుని దక్షిణ ధ్రువంపై తమ ల్యాండర్‌ను దించేందుకు లూనా -25 ప్రయోగాన్ని చేపట్టింది. భారత్‌ కంటే ముందే, చంద్రుడిపై ల్యాండర్‌ను దింపి ఆ ఘనత సాధించిన తొలి దేశంగా నిలవాలని రష్యా భావించింది. వేర్వేరు మార్గాల ద్వారా ఈ రెండు దేశాల అంతరిక్ష నౌకలు చంద్రుడి దక్షిణ ధ్రువం వైపు దూసుకెళ్తున్నాయి. అయితే రష్యా ల్యాండర్‌ నిర్దేశించుకున్న సమయానికి జాబిల్లిపై దిగే అవకాశాలు తక్కువే అని తెలుస్తోంది. భారత ల్యాండర్‌ స్థిరంగా నిర్దేశిత లక్ష్యం దిశగా పయనిస్తుండగా.. రష్యా మాత్రం చాలా హడావిడిగా జాబిల్లి దక్షిణ ధ్రువం వైపు పయనిస్తోందని ఓ నివేదిక వెల్లడించింది .

Tags

Read MoreRead Less
Next Story