Chandrayaan-3: చంద్రుడిపై ఉష్ణోగ్రత ఎంతంటే…

చంద్రయాన్-3 ఉపగ్రహంలోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలం గురించి అధ్యయనం చేసి సమాచారాన్ని ఇస్రోకి చేరవేసింది. తొలి పరిశీలనకు సంబంధించిన ఫలితాలను ఇస్రో..గ్రాఫ్ రూపంలో ట్విట్టర్(ఎక్స్) లో షేర్ చేసింది. చంద్రుడిపై నమోదవుతోన్న వివిధ రకాల ఉష్ణోగ్రతలను ఇస్రోకు చేరవేసింది ప్రగ్యాన్ రోవర్. ఉపరితలం నుంచి పది సెంటీమీటర్ల లోతు వరకు టెంపరేచర్లు అబ్జర్వ్ చేయగా.. అందుకు సంబంధించిన గ్రాఫ్‌ను విడుదల చేసింది ఇస్రో.
చంద్రయాన్-3 విజయవంతంగా చందుడిపై అడుగుపెట్టడమే కాదు దాని కార్యాచరణను కూడా మొదలుపెట్టింది. శనివారం శివశక్తి పాయింట్ వద్దనున్న విక్రమ్ ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి ఉపరితలంపైకి జారుకుని అధ్యయనాలను కూడా ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై 10సెం.మీ. లోతు వరకు ఉపరితలాన్ని అధ్యయనం చేసిన ప్రజ్ఞాన్ రోవర్ తొట్టతొలిసారి చంద్రుడి దక్షిణ ధృవం వద్దనున్న నేలకి సంబంధించిన సమాచారాన్ని భూమికి చేరవేసింది.
ChaSTE(చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్) పేలోడ్ చంద్రుడి ఉపరితలం యొక్క ఉష్ణోగ్రతలను అధ్యయనం చేసింది. ఇస్రో ఈ సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఇస్రో షేర్ చేసిన ఈ గ్రాఫ్‌లో చంద్రుడి ఉపరితలం ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెల్సియస్ నుండి 60 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ గ్రాఫ్ చంద్రుని ఉపరితలంపై లోతు వ్యత్యాసాన్ని బట్టి ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గులను సూచిస్తోంది. చంద్రుని దక్షిణ ధృవానికి సంబంధించి ఇదే మొట్టమొదటి అధ్యయనం. ఇంకా లోతైన పరిశీలనలు జరుగుతున్నాయని ఇస్రో ట్వీట్ చేసింది.
చంద్రయాన్-3లో మొతం ఏడు పేలోడ్‌లు ఉండగా అందులో విక్రమ్ ల్యాండర్ నాలుగు, ప్రజ్ఞాన్ రోవర్ రెండు నిర్వహించనుండగా ఒకటి మాత్రం ప్రపల్షన్ మాడ్యూల్ నిర్వహించనుంది. ఈఏడు పేలోడ్‌లు ఒక్కొక్కటీ కొన్ని శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తాయి. చంద్రుడి నేలపై అధ్యయనం చేస్తున్న ChaSTE కాకుండా విక్రమ్‌లోని RAMBHA (అయాన్‌లు మరియు ఎలక్ట్రాన్‌లను అధ్యయనం చేయడానికి), ILSA (భూకంపాన్ని అధ్యయనం చేయడానికి), LRA (చంద్రుని వ్యవస్థ యొక్క గతిశీలతను అర్థం చేసుకోవడానికి) నిర్దేశించబడ్డాయి. తాజా అప్‌డేట్‌తో చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు చేసేందుకు మార్గం సుగమమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com