CHANDRAYAN 3: మరింత అందంగా జాబిల్లి

CHANDRAYAN 3: మరింత అందంగా జాబిల్లి
జాబిల్లి ఉపరితలాన్ని ఫొటోలు తీసి భూమికి పంపిన చంద్రయాన్‌-3... ఆసక్తికర వీడియో షేర్‌ చేసిన పీఐబీ

కోట్లాది మంది భారతీయులు సహా ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న చారిత్రక క్షణాల సమీపిస్తున్న వేళ చంద్రయాన్‌ 3.. జాబిల్లి ఉపరితలాన్ని ఫొటోలు తీసి భూమికి పంపింది. ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరాతో కేవలం జాబిల్లి ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఫొటోలను చంద్రయాన్‌ తీసింది. మిషన్‌ షెడ్యూల్‌ ప్రకారమే కొనసాగుతోందని ఇస్రో ప్రకటించింది. సాధారణ తనిఖీల్లో భాగంగా వ్యోమనౌక సిస్టమ్‌లో అంతా సవ్యంగా సాగుతున్నట్లు గుర్తించామని పేర్కొంది. ఈ చిత్రాలు అంక్షాంశం, రేఖాంశ స్థానాలను నిర్ధారించుకోవడంలో ల్యాండర్‌కు తోడ్పడతాయని తెలిపింది. ఇప్పటికే చంద్రయాన్‌ 3లో ప్రోగ్రామ్‌ చేసిన చంద్రుని రిఫరెన్స్‌ మ్యాప్‌తో ఈ ఫొటోలను ల్యాండర్‌ సరి పోల్చుకుంటుందని పేర్కొంది.


మరోవైపు ప్రెస్ ఇన్ఫర్ మేషన్ బ్యూరో ఆసక్తికర వీడియో విడుదల చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ -3ని రూపొందించినప్పటి నుంచి షార్ వేదిక వద్ద ప్రయోగం, రోదసిలోకి దూసుకెళ్లడం, భూకక్ష్యలో నుంచి చంద్రుడి కక్ష్యలోకి మారడం వంటివి ఈ వీడియోలో క్లుప్తంగా చూపించారు. 40 రోజుల చంద్రయాన్ 3 ప్రయాణాన్ని 60 సెకన్లలో వివరించారు. చివరగా జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ అడుగుపెట్టినట్లు ఆ వీడియోలో ఉంది. విక్రమ్ ల్యాండర్ కిందకు దిగగానే అందులోని ప్రజ్ఞాన్ రోవడ్ జారుకుంటూ బయటకు వచ్చినట్లు ఊహాజనితంగా యానిమేషన్ రూపంలో వీడియోలో చూపించారు.

Tags

Read MoreRead Less
Next Story