Char Dham Yatra : తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం

ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత వేద మంత్రోచ్చరణ, డప్పు, నాదస్వర వాయిద్వాల నడుమ బద్రీనాథ్ ఆలయతలుపులను పూజారులు తెరిచారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయ తలుపులు తెరవడంతో చార్‌ధామ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. చార్‌ధామ్ యాత్రలో బద్రీనాథ్, కేదార్ నాథ్, యుమునోత్రి, గంగోత్రి ఆలయాలను భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. బద్రీనాథ్ ఆలయ తలుపులు తెచురుకోగానే ఆలయంలో లోపలికి భక్తులు పోటెత్తారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భారీగా భక్తులు తరలి వచ్చారు. కేదరనాథ్, యుమునోత్రి, గంగోత్రి ఆలయాల తలుపులను అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారమే తెరిచారు.
చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన మరుసటి రోజు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా వాతావరణం ప్రతికూలంగా మారడంతో యాత్రలో ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లతో పాటు చార్ ధామ్ యాత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన గంగోత్రి ఆలయంతో సహా గంగా లోయలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భక్తుల కోసం ఆలయ తలుపులు తెరవడానికి ఒక రోజు ముందు ఎత్తైన శిఖరాలలో హిమపాతం, లోతట్టు ప్రాంతాలు వర్షంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈరోజు బద్రీనాథ్‌లో వాతావరణం కూడా ఒక్కసారిగా మారింది. భారీగా మంచు కురుస్తోంది.అంతకుముందు రోజు, యమునోత్రికి కొండ మార్గంలో పెద్ద సంఖ్యలో భక్తులు గంటల తరబడి క్యూలలో చిక్కుకున్నారు. అధికారులు నిర్వహణ సరిగా లేకపోవడమే కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. యమునోత్రి, కేదార్‌నాథ్, గంగోత్రి ఆలయాల తలుపులు భక్తుల కోసం తెరవడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు యమునోత్రి, కేదార్‌నాథ్ తలుపులు తెరుచుకోగా, వేలాది మంది భక్తుల సమక్షంలో గంగోత్రి ఆలయ తలుపులు మధ్యాహ్నం 12.25 గంటలకు తెరుచుకున్నాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్-మే నుంచి అక్టోబర్-నవంబర్ వరకు లక్షలాది మంది భక్తులు చార్ ధామ్ యాత్రకు వస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com