Punjab CM Candidate: పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ..

Punjab CM Candidate: పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ..
Punjab CM Candidate: పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.

Punjab CM Candidate: పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం ఎంతో ఎదురు చూసిన పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూకి భంగపాటు తప్పలేదు. వాస్తవానికి పంజాబ్‌ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఒకవైపు సిద్ధూ, మరొకవైపు చరణ్‌జిత్ సింగ్ చన్నీలు పోటీపోటాగా ఉన్నారు.

కాగా, ఎన్నికల ప్రచారం కంటే ఇదే చర్చ ఎక్కువ కావడంతో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఫిబ్రవరి 6న ప్రకటించి ఈ చర్చకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అనుకున్నట్లుగానే పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యనేతలందరితో నిర్వహించిన సమావేశంలో చరణ్‌జిత్ సింగ్ చన్నీనే కాంగ్రెస్ తరపు ముఖ్యమంత్రి అభ్యర్థి అని రాహుల్ గాంధీ ప్రకటించారు.

Tags

Next Story