Kuno National Park: చిరుత ఆచూకీ లభ్యం

కునో నేషనల్ పార్క్‌లో 22 రోజుల ముందు నుంచి కనబడకుండా పోయిన ఆడ చిరుత ఎట్టకేళకి దొరికిపోయింది. మధ్యప్రదేశ్‌లోని ఈ పార్క్ లో జూలై 21నుంచి ఓ చిరుత కనపడకుండా పోయింది. రేడియో కాలర్ పనిచేయడం మానేసినప్పటి నుంచి దాని జాడ తెలియలేదు. అయితే 22 రోజుల సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఆదివారం చిరుతను కనుగొన్నట్టు అధికారులు ప్రకటించారు. దానికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని, అంతా బానే ఉందని తెలిపారు.
కనపడకుండా పోయిన చిరుత కోసం గత 22 రోజులుగా 100 మందికి పైగా ఫీల్డ్ సిబ్బంది, వైద్యులు, అధికారులు తీవ్రంగా గాలించారు. అయితే ఆగష్టు 12న డ్రోన్ ద్వారా చిరుత ఎక్కడుందనేది తెలుసుకుందామన్నారు. ఆ చీతాను కనిపెట్టేందుకు అధికార బృందంతో పాటు, రెండు డ్రోన్లు, ఒక డాగ్ స్క్వాడ్ సహాయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ కెమెరాల ఆధారంగా.. నిర్వా ఆరోగ్యంగా కనిపిస్తూ కదులుతుండటాన్ని గుర్తించామని అయితే అప్పటికే చీకటి పడటంతో.. ఆదివారం ఉదయం ఆపరేషన్‌ను పునఃప్రారంభించారు. డ్రోన్ బృందాలు రాత్రంతా చీతా ఉన్న ప్రదేశాన్ని ట్రాక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు ఆదివారం తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా.. చీతాను పట్టుకున్నారు. నిర్వాను పట్టుకోవడానికి దాదాపు ఆరు గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు.
చిరుతలకు ప్రసిద్ధి కునో నేషనల్ పార్క్. విదేశాల నుండి తెచ్చిన చరిత్రను సైతం ఇక్కడే ఉంచుతారు. ఇక్కడ మొత్తం 15 చిరుతలు ఉన్నాయి. అందులో ఏడు మగవి, ఏడు ఆడవి, ఒక ఆడపిల్ల ఉన్నాయి. ప్రస్తుతం అవి ఆరోగ్యంగానే ఉన్నట్లు కునో పశువైద్యుల బృందం తెలుపుతుంది.
ఇండియాలో చిరుతలు అంతరించిపోతున్నాయనే నేపథ్యంలో గత సెప్టెంబర్ 17న నమిబీయా నుండి 8 చిరుతలను తీసుకొచ్చారు. తరువాత ఫిబ్రవరిలో మరో 12 చిరుతలను, అంటే రెండు దశల్లో మొత్తం 20 చీతాలను భారత్‌కు తీసుకొచ్చారు. అయితే ఈ ఏడాది మార్చిలో జ్వాలా అనే నమీబియా చిరుత నాలుగు పిల్లలు జన్మనిచ్చింది. అందులో మూడు చనిపోయాయి. మరోవైపు మార్చి నుండి ఇప్పటివరకు వివిధ కారణాల వల్ల ఆరు చిరుతలు మరణించాయి. దీంతో మొత్తం చిరుత మరణాల సంఖ్య తొమ్మిదికి చేరుకున్నాయి. కునో నేషనల్ పార్క్‌లో చీతాలు వరుసగా మృతి చెందడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com