Jaya Prada: జయప్రదకు జైలు శిక్ష

Jaya Prada:  జయప్రదకు జైలు శిక్ష
చెన్నైలోని థియేటర్ కార్మికుల కేసులో జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు కోర్టు షాకిచ్చింది. ఓ కేసులో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం ఎగ్మోర్ కోర్టు తీర్పు వెలువరించింది. జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా కూడా విధించింది.

ఆ కాలంలో స్టార్ హీరోయిన్ వెలుగొందిన తార జయప్రద. ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కృష్ణ వంటి గొప్ప నటులతో స్క్రీన్ ను పంచుకొని విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. అందరు స్టార్ హీరోల సరసన నటించి.. ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు నేలపై పుట్టి హిందీలో కూడా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకుంది. రెండు భాషల్లోనూ, రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. జితేంద్ర, రిషీ కుమార్‌ వంటి అగ్ర హీరోలే అప్పట్లో ఆమె డేట్స్‌ కోసం వేయిట్ చేసే వారంటే ఆమె స్థాయేంటో అర్థం చేసుకోవచ్చు. తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా దిగ్విజయం ముందుకు వెళ్ళింది.


అయితే ఇప్పుడు ఆమెకు ఊహించని షాక్ తగిలింది.చెన్నైలోని రాయపేటలో ఆమెకు ఓ సినిమా థియేటర్ ఉంది. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో పాటు జయప్రద ఈ సినిమా హాల్ ను నడిపించారు. కానీ ముందు బాగానే నడిచినా తర్వాత కాలంలో నష్టాల్లో కూరుకుపోవడంతో థియేటర్ ను మూసేశారు.

అప్పట్లో థియేటర్ లో పనిచేసిన కార్మికుల నుంచి ఈఎస్ఐ కోసం వసూలు చేసిన మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు యాజమాన్యం చెల్లించలేదు. దీనిపై ఇటు కార్మికులు, అటు కార్పొరేషన్ ఎగ్మూరు కోర్టును ఆశ్రయించారు. అయితే కేసు విచారణ సందర్భంగా కార్మికులకు చెల్లించాల్సిన మొత్తాన్ని బయట సెటిల్ చేసుకుంటామని, ఆ మొత్తం వెంటనే చెల్లించేందుకు సిద్ధమని జయప్రద తరఫున లాయర్ కోర్టుకు వెల్లడించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. జయప్రదతో పాటుగా మరో ముగ్గురికి ఎగ్మోర్ కోర్టు ఆర్నెళ్లు జైలు శిక్ష విధిస్తూ.. ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story