Bottle Gourd-Boy: కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన యువకుడు.. ఎక్స్‌రే తీసి చూడగా

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడి కడుపులోంచి అడుగుకు పైగా పొడవున్న సొరకాయను వైద్యులు బయటకు తీశారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. యువకుడికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అతడి శరీరంలోకి ఇది మలద్వారం ద్వారా వచ్చి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సొరకాయను ఎవరైనా బలవంతంగా చొప్పించారా? లేదా ఇంకేమైనా జరిగిందా? అన్నది యువకుడు స్పృహలోకి వచ్చాక తెలియనుంది.
సమాచారం ప్రకారం… మూడు రోజుల క్రితం ఖజురహో ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తీవ్రమైన కడుపు నొప్పితో ఛతర్‌పుర్ జిల్లా ఆస్పత్రికి వచ్చాడు. భయంకరమైన కడుపు నొప్పిగా ఉందని, అస్సలు తట్టుకోలేక పోతున్నాని డాక్టర్లతో చెప్పాడు. ప్రాథమిక పరీక్ష అనంతరం అతడికి ఎక్స్‌రే తీశారు. కడుపులో పొడవైన వస్తువు చూసి డాక్టర్ నందకిశోర్ జాదవ్ షాక్ అయ్యారు. ఏం జరిగిందని యువకుడిని అడగ్గా.. అతడు చెప్పే పరిస్థితిలో లేడు. ఆపరేషన్ ద్వారా మాత్రమే ఆ వస్తువును తొలగించవచ్చని కుటుంబసభ్యులతో చెప్పారు.
నందకిశోర్ జాదవ్ ఆధ్వర్యంలో శనివారం యువకుడికి ఆపరేషన్ జరిగింది. కొన్ని గంటలపాటు ఆపరేషన్ జరిగింది. వైద్యుల బృందం అతడి పొట్టలో తొడిమతో కూడిన సొరకాయను చూసి అవాక్కయ్యారు. ఈ సొరకాయ వల్ల యువకుడి పెద్ద పేగు పూర్తిగా నలిగిపోయింది. దీంతో అతనిడికి తీవ్రమైన నొప్పి వస్తోంది. యువకుడు స్పృహలోకి వస్తే గానీ అసలు విషయం ఏంటో తెలియరానుంది. సొరకాయ అడుగుకు పైగా పొడవు ఉన్నట్లు వైద్యులు చెప్పారు. యువకుడి శరీరంలో ఈ సొరకాయ మల మార్గం నుంచి వచ్చిన వైద్యులు భావిస్తున్నారు. మానసిక పరిస్థితి బాగాలేని వారే ఇలాంటి పనులు చేస్తారని వైద్యులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com