Bhupesh Baghel: నాలుగు రోజుల్లో ఎన్నికలు, పీకల్లోతు అవినీతి ఆరోపణలు

Bhupesh Baghel: నాలుగు రోజుల్లో ఎన్నికలు, పీకల్లోతు అవినీతి ఆరోపణలు
భారీ కుంభకోణంలో ఇరుక్కున్న ఛత్తీస్‭గఢ్ సీఎం?

ఛత్తీస్‭గఢ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. కానీ ఇంతలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ భారీ కుంభకోణంలో ఇరుక్కున్నట్లే కనిపిస్తోంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఆయన పేరును చేర్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) . మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు భూపేష్ బఘేల్‌కు 508 కోట్ల రూపాయలు ఇచ్చారని శుక్రవారం (నవంబర్ 3) ఈడీ పేర్కొంది. తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా దేశంలో లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏకంగా ముఖ్యమంత్రి హస్తమే ఉందని ఈడీ పేర్కొనడంతో రాజకీయం ఛత్తీస్‭గఢ్ రసవత్తరంగా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి బఘెల్ తరుచూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పేరు ఇలా రావడం గమనార్హం.

ఇక ఎన్నికల విషయానికి వస్తే ఛత్తీస్‭గఢ్ బీజేపీ కి ఏంతో ముఖ్యమైనది. ఛత్తీస్‭గఢ్‭ రాష్ట్రం 2000 సంవత్సరంలో ఏర్పడింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉన్న ఆ ప్రాంతాన్ని అప్పటి అటల్ బిహార్ వాజిపేయి ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2003లో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎన్నికలు జరిగాయి. ఇక అప్పటి నుంచి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీదే జోరు. అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు ఆ రాష్ట్రానికి రమణ్ సింగే ఏకైక ముఖ్యమంత్రి. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అధికారంలో ఉండేది బీజేపీనే, ముఖ్యమంత్రి రమణ్ సింగే. అలా మారిపోయింది రాష్ట్ర రాజకీయం.

కానీ 2018లో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ ఎన్నికల్లో 90 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 68 స్థానాలతో సాధించి బీజేపీకి దారుణ పరాభవాన్ని ఇచ్చింది. భూపేష్ బాఘేల్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోవస్తోంది. వచ్చే నెలలో రెండు దశల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తదుపరి అధికారంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


Tags

Read MoreRead Less
Next Story